మిమ్మల్ని గౌరవించిన సినీ ఇండస్ట్రీలని గౌరవించండి

Published on Wed, 11/04/2026 - 17:46

ఇటీవల కొందరు హీరోయిన్లు దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారుతోంది. అవకాశాలొచ్చినప్పుడు ఇక్కడ పనిచేసి, గుర్తింపు తెచ్చుకుని తర్వాత కాలంలో ఇదే పరిశ్రమలని కించపరిచేలా మాట్లాడుతున్న నాయికలను ఉద్దేశించి తనదైన శైలిలో నిర్మాత ఎస్కేఎన్ పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

తెలుగు, సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు తెచ్చుకున్న కొందరు నాయికలు కొన్నేళ్ల తర్వాత ఇదే పరిశ్రమను విమర్శించడం తగదు. సదరు నాయికలు ఇక్కడి కథలు, సంప్రదాయాలను తప్పుగా చెబుతున్నారు. ప్రతి నటీనటులకు తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సద్విమర్శలు చేయకుండా మిమ్మల్ని ఆహ్వానించిన పరిశ్రమనే చిన్న చూపు చూసేలా మాట్లాడటం సరికాదు. తెలుగు సినిమా, దక్షిణాది సినిమా పరిశ్రమలు కథల్లో తమదైన సంప్రదాయాలను, సంస్కృతులను ప్రదర్శిస్తాయి. బయటి వాళ్లకు అవి అసాధారణంగా అనిపించవచ్చు. మాకు మాత్రం ఆ సంప్రదాయాలు, సంస్కృతులు పరిచితమే. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. అవకాశాలు వచ్చినప్పుడు ఎంతో అపురూపంగా భావించిన మీరు ఇప్పుడు వాటిని కించపరచడం అంగీకారం కాదు. మాదే గొప్ప సంస్కృతి అనేలా ప్రవర్తించడాన్ని ఎవరూ ఒప్పుకోరు. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను గౌరవించండి అని ఎస్కేఎన్ ట్వీట్ చేశారు.

రీసెంట్‌గా హీరోయిన్ రాధిక ఆప్టే.. గతంలో బాలకృష్ణ 'లెజెండ్'లో నటించడం గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో మామని పెళ్లి చేసుకునే సీన్ ఉంది. అలానే హీరోతో చేసిన రొమాన్స్ ఇబ్బంది పెట్టింది. నా పాత్రని మధ్యలోనే చంపేశారని చెప్పుకొచ్చింది. ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ క్రమంలోనే ఎస్కేఎన్ కూడా కౌంటర్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: శ్రీలీలకి కోలీవుడ్‌లో బంపరాఫర్స్.. ఈసారి ఏమవుతుందో?)

Videos

పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు

58 ఓట్లతో YSRCP ఆధిక్యం.. తిరుపతిలో రీకౌంటింగ్ రగడ..!

కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

పులివెందులలో బీటెక్ రవి కుట్రలు

రెండుసార్లు రీకౌంటింగ్ పెట్టినా.. YSRCP అభ్యర్థి విజయం..

నన్ను గెలిపించిన అనంతపురం ప్రజలకు మాటిస్తున్న..

అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

నాకిచ్చిన బ్యాలెట్ నెంబర్ మూడు.. కానీ పేపర్ పై ఆ నెంబర్ లేదు..

గెలుపోటములు సహజం.. ఓటమిపై కోలగట్ల శ్రావణి రియాక్షన్

అయ్యా పోలీసువారు మొత్తం గెలిపించింది మీరే.. బూచేపల్లి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)

+5

'అక్క' మరో ప్రపంచంలో ఉంటే ఇలానే (ఫొటోలు)

+5

#బాలు-గీత ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)