Breaking News

భారత్‌లో డేటా సెంటర్ల జోరు

Published on Wed, 11/04/2026 - 13:35

రాబోయే నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యాలు భారీగా విస్తరించనున్నాయి. 2030 మార్చి నాటికి ఐదు రెట్లు పెరిగి సుమారు 7.5 గిగావాట్ల (జీడబ్ల్యూ) స్థాయికి చేరనున్నాయి. డేటా సెంటర్ల విభాగం రూ. 3 లక్షల కోట్ల పైగా పెట్టుబడులను ఆకర్షించనుంది. క్రిసిల్‌ రేటింగ్స్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (జెన్‌ఏఐ), ఎంటర్‌ప్రైజ్‌ డిజిటలీకరణ, డేటా వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలు డేటా సెంటర్ల విస్తరణకుదోహదపడనుంది. అయితే, డిమాండ్‌కి తగ్గట్లుగా నిలకడగా రాబడులు లభించడమనేది సకాలంలో విద్యుత్‌ కనెక్టివిటీ, నియంత్రణ సంస్థల అనుమతులు, క్రమశిక్షణతో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది.

క్లౌడ్‌ వినియోగం, కంప్యూట్‌ సామర్థ్యాలు అత్యధికంగా అవసరమయ్యే జెన్‌ఏఐ వర్క్‌లోడ్‌లను భరించేందుకు హైపర్‌స్కేలర్లతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా ఆదాయాలపరమైన స్పష్టత ఉంటుందని నివేదిక పేర్కొంది. దీని వల్ల ప్రాజెక్టులకు రిసు్కలు తగ్గుతాయని వివరించింది.

రిపోర్టులో మరిన్ని ముఖ్యాంశాలు..
తక్కువ వ్యయాల భారం కారణంగా డేటా సెంటర్లకు భారత్‌ ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తోంది. ఆసియా–పసిఫిక్‌లో పోటీపడుతున్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో డెవలప్‌మెంట్‌ వ్యయాలు దాదాపు 20 శాతం తక్కువగా ఉంటున్నాయి. విద్యుత్‌ టారిఫ్‌లు సైతం తక్కువగా ఉండటంతో మొత్తం మీద పోటీ మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో అద్దెలు దాదాపు 30–35 శాతం తక్కువగా ఉంటున్నాయి.  పునరుత్పాదక విద్యుత్‌ వినియోగించే భారీ క్యాంపస్‌లు అందుబాటులో ఉండటం కూడా భారత్‌ను హైపర్‌స్కేలర్లకు ఆకర్షణీయంగా నిలుపుతోంది.

రాబోయే 6 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంలో నాలుగింట మూడొంతుల వాటా విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్‌ ఉండనుంది. దీనితో 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుత గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌లో వరుసగా 80 శాతం, 60 శాతం, 20 శాతం స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సెంటర్ల ఏర్పాటులో జాప్యం జరగకుండా చూసేందుకు, వ్యయాలు అదుపు తప్పకుండా చూసేందుకు గ్రిడ్‌ కనెక్టివిటీ, ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున డేటా సెంటర్ల విస్తరణ ప్రతిపాదనలతో విద్యుత్‌ మౌలిక సదుపాయాలపై భారం పెరుగుతోంది.

ప్రస్తుతమున్న డేటా సెంటర్లు 90 శాతం సామర్థ్యాలతో పని చేస్తున్నాయి. ఇక కొత్తగా నిర్మిస్తున్న వాటిలో 95 శాతం సామర్థ్యం వినియోగానికి ఇప్పటికే కాంట్రాక్టులు కుదిరాయి. ప్రీ-లీజింగ్‌ స్థాయులు అత్యధికంగా ఉండటం వల్ల ప్రాజెక్టులు అందుబాటులోకి రాగానే 
ఆదాయాలు రావడం మొదలవుతుంది కాబట్టి, డెవలపర్లు వేగవంతంగా సెంటర్లను సిద్ధం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

కాంట్రాక్టుల వ్యవధి కూడా 10-12 ఏళ్ల నుంచి 15-20 ఏళ్లకు పెరిగింది. దీనితో స్థిరంగా ఆదాయార్జనపై స్పష్టత ఉంటుంది. ఒకవేళ వేరేదానికి మారాలంటే వ్యయాలు, పెట్టుబడుల రూపంలో భారీగా వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి క్లయింట్లు వెళ్లిపోకుండా కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో డెవలపర్లు కూడా కొత్త తరం జెన్‌ఏఐ వర్క్‌లోడ్‌లకు అనుగుణంగా డేటా సెంటర్లను అప్‌గ్రేడ్‌ చేసేందుకు సకాలంలో పెట్టుబడులు కూడా పెట్టాల్సి ఉంటుంది.

#

Tags : 1

Videos

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

YSRCP నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)