Breaking News

బల్లి కాళ్లకు జిగురు ఉంటుందా? తోకను ఎందుకు తెంచుకుంటుంది?

Published on Wed, 11/04/2026 - 10:12

గోడమీద కనిపించే బల్లి గురించి మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. రాత్రివేళ గోడలపై పరుగులు తీస్తూ, రెప్పపాటులో పురుగులను పట్టుకునే బల్లులు ప్రకృతిలో అద్భుతమైన జీవులు. వీటి శరీర నిర్మాణం, వేటాడే విధానం, గోడలపై నడిచే ప్రత్యేకత వెనుక ఆసక్తికరమైన శాస్త్రం ఉంది. ఈరోజు అదేంటో తెలుసుకుందాం!

బల్లులు సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితమే భూమిపై ఉనికిలో ఉన్నాయని పురాతన జీవుల అవశేషాల పరిశీలనలు సూచిస్తున్నాయి. ఇవి సరీసృపాల వర్గానికి, స్క్వామేటా (Squamata) క్రమానికి చెందిన జీవులుగా, అలాగే గెక్కో (Gecko) అనేది బల్లుల్లో ఒక ప్రత్యేక కుటుంబమని, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000కు పైగా గెక్కో జాతులు ఉన్నట్లు జీవశాస్త్ర వర్గీకరణ అధ్యయనాలు చెబుతున్నాయి.

గోడకు అతుక్కుని ఎలా పాకుతుందో తెలుసా?
బల్లి కాళ్ల వేళ్ల అడుగుభాగంలో లక్షలాది సూక్ష్మ వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని సెటే (Setae) అని పిలుస్తారు. ఇవి గోడ ఉపరితలంతో ఏర్పరిచే సూక్ష్మ భౌతిక ఆకర్షణ శక్తి కారణంగా బల్లి గోడలు, అద్దాలపై కూడా సులభంగా పాకగలుగుతుంది.

ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు.. అదేంటంటే? బల్లి కాళ్లకు అత్తుకునే జిగురు ఏమైనా ఉంటుందా అని. అయితే, బల్లి కాళ్లకు ఎలాంటి జిగురు పదార్థం ఉండదు. వాన్ డెర్ వాల్స్ బలాలు (Van der Waals forces - రెండు వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు వాటి అణువుల మధ్య ఏర్పడే స్వల్ప ఆకర్షణ) అనే సూక్ష్మ ఆకర్షణ శక్తులే గోడకు గట్టిగా అతుక్కునేలా చేస్తాయి. కెల్లర్ ఆటమ్ (Kellar Autumn)తో పాటు ఇతర పరిశోధకులు PNAS జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ విషయాలను వివరించారు.

తన తోకను తానే ఎందుకు తెంచేసుకుంటుంది?
శత్రువుల నుంచి ప్రాణాపాయం ఎదురైనప్పుడు బల్లి తన తోకను తానే తెంచేసుకుంటుందట! దీంతో అది వేగంగా ముందుకు పాకడానికి సులభంగా ఉండటం కూడా ఒక కారణం.

హెర్పెటాలజిస్టుల పరిశోధనల ప్రకారం.. తోక తెగిపోయిన తర్వాత కూడా కొంతసేపు కదులుతూ శత్రువుల దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో వేటాడే జీవి దృష్టి తోకపైకి మళ్లిన సమయంలో బల్లి అక్కడి నుంచి వేగంగా తప్పించుకుంటుంది. ఇలా తన ప్రాణాలను కాపాడుకునేందుకు తోకను వదిలేసే ప్రత్యేక రక్షణ విధానాన్ని బల్లులు కలిగి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

బల్లుల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు...

  • ఇవి రాత్రిపూట చురుగ్గా ఉంటాయి. తక్కువ వెలుతురులో కూడా కదలికలను గుర్తించి పురుగులను వేటాడగలవు.

  • వీటికి తెగిపోయిన తోక తిరిగి పెరుగుతుంది. అయితే కొత్తగా పెరిగే తోక అసలు తోకలా కాకుండా కొంత భిన్నంగా ఉంటుంది.

  • ఇవి దోమలు, ఈగలు, చిన్న సాలెపురుగులు, ఇతర చిన్న కీటకాలు ఆహారంగా తీసుకుంటాయి. దాంతో ఇంట్లో కీటకాల సంఖ్యను తగ్గించడంలో కొంతవరకు సహాయపడతాయి.

  • బల్లులకు బయటి చెవులు మనుషుల్లా కనిపించవు. కానీ తల పక్కన చిన్న చెవి రంధ్రాలు ఉంటాయి. వీటితో అవి శబ్దాలను వినగలవు.

  • కొన్ని బల్లి జాతులు.. పరిసరాలు, వెలుతురు, ఉష్ణోగ్రత, శరీర స్థితిని బట్టి రంగులో మార్పులు చూపుతాయి. అయితే మన ఇళ్లలో కనిపించే సాధారణ బల్లులు ఊసరవెల్లిలా రంగులు మార్చలేవు.

  • బల్లులు గుడ్లు పెడతాయి. అలాగే, కొన్ని జాతులు గుడ్లను గోడల సందులు, పగుళ్లు, సురక్షితమైన ప్రదేశాల్లో పెడతాయి.

  • వీటి జాతిని బట్టి జీవించే కాలం మారుతుంది. సాధారణంగా ఇంటి బల్లులు మాత్రం అనుకూల పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలు జీవించగలవు.

  • చాలా గెక్కో జాతులకు చెందిన బల్లులకు కనురెప్పలు ఉండవు. అందుకే నాలుకతో కళ్లపై ఉన్న పలుచని పొరను శుభ్రం చేసుకుంటాయి. అలాగే, అన్ని గెక్కో జాతులకు ఇదే లక్షణం ఉండదు.

  • బల్లులు కూడా నీళ్లు తాగుతాయి. గోడలు, ఆకులు, ఇతర ఉపరితలాలపై ఏర్పడే నీటి బిందువులను నాలుకతో నాకి తాగుతాయి.

బల్లి మనుషులకు ప్రమాదకరమా?
సాధారణంగా ఇళ్లలో గోడలపై కనిపించే బల్లులు మనుషులకు నేరుగా ప్రమాదకరం కాదని పరిశోధకులు చెబుతున్నారు. వీటిలో చాలా వరకు విషపూరితమైనవి కావు, మనుషులపై దాడి చేయడం కూడా అరుదు. అయితే బల్లి విసర్జనలో హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉండటంతో ఆహార పదార్థాలపై పడకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. దాంతో ఆహారాన్ని ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలని, బల్లి విసర్జన పడిన ఆహారాన్ని తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? బల్లి గోడపై తలకిందులుగా వేలాడగలగడం, అద్దంపై నడవగలగడం చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ప్రత్యేకమైన పాదాల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని గోడలకు అతుక్కునే రోబోలు, ప్రత్యేకంగా అంటుకునే పదార్థాల తయారీపై పరిశోధనలు జరిగాయి. అంటే మనం రోజూ గోడపై చూసే చిన్న బల్లిలో ఇన్ని అద్భుతాలు దాగి ఉన్నాయన్నమాట!

ఇదీ చదవండి: భయాన్ని కూడా ఎంజాయ్‌ చేస్తారా? శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటంటే?

Videos

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

YSRCP నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)