Breaking News

ఏఐ షాపింగ్‌లో జెన్‌జీ కంటే మిలినియల్స్ టాప్‌!

Published on Sun, 11/01/2026 - 16:40

సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో భారతీయ వినియోగదారుల కొనుగోలు శైలిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఏఐ ఆధారిత షాపింగ్‌ టూల్స్‌ను ఉపయోగించడంలో మిలినియల్స్‌ సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశంలో మిలినియల్స్‌(1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారు)లో ఏఐ షాపింగ్‌ అడాప్షన్‌ ఏకంగా 84 శాతంగా నమోదైంది. దీనితో వారు జెన్‌జీ (1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు-74 శాతం)తో పోలిస్తే ముందుజలో ఉన్నారు.

ప్రపంచ స్థాయిలో భారత్‌కు రెండో స్థానం

ఏఐ ఆధారిత కొనుగోళ్లలో చైనా తొలి స్థానంలో ఉండగా భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ సగటు (53 శాతం)తో పోలిస్తే భారతదేశంలో ఏఐ షాపింగ్‌ వినియోగం 76 శాతంగా ఉండటం విశేషం. దేశంలోని వినియోగదారులు కేవలం ప్రొడక్ట్ సెర్చ్‌ చేయడం వరకే పరిమితం కాకుండా వస్తువులను పోల్చడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, చివరికి చెల్లింపులు పూర్తి చేయడానికి కూడా ఏఐ టూల్స్‌పై ఆధారపడుతున్నారు.

తరాల వారీగా ఏఐ షాపింగ్ వినియోగ తీరు

మెకిన్సే ఏజెంట్ కామర్స్ కన్స్యూమర్ సర్వే ప్రకారం వివిధ వర్గాల వినియోగదారుల భాగస్వామ్యం ఇలా ఉంది.

  • మిలినియల్స్: 84 శాతం

  • జెన్-జీ: 74 శాతం

  • జెన్ ఎక్స్: 74 శాతం

  • బేబీ బూమర్స్: 56 శాతం

ఈ గణాంకాలను బట్టి చూస్తే డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్‌లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న భారత్ ఇప్పుడు ఏజెంటిక్ కామర్స్(మనుషులు ఇచ్చే ఆదేశాల ప్రకారం పనిచేయడమే కాకుండా స్వయంగా ఆలోచించి, విశ్లేషించి, కొనుగోలు నిర్ణయాలు తీసుకోగల ఏఐ ఏజెంట్లు ద్వారా జరిగే ఈ-కామర్స్ వ్యాపార విధానం) దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)