Breaking News

మరో వివాదంలో ఆదర్శ కుటుంబం.. మీరలా చూపించారేంటి త్రివిక్రమ్ సార్?

Published on Sun, 11/01/2026 - 14:16

'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సూపర్ హిట్ తర్వాత వెంకీమామ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ 'ఆదర్శ కుటుంబం-ఏకే47'.  ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిచారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద  సందడి చేస్తోంది.

అయితే ఈ మూవీ రిలీజ్‌ అయ్యాక వివాదం మొదలైంది. ఈ సినిమాలో జిమ్ జిమ్ తార సాంగ్ వాడారంటూ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో వెంకటేశ్‌కి సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటని వినియోగించడం అన్యాయమని పేర్కొన్నారు. చిన్న సినిమాను బ‌తికించండని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాజాగా ఈ సినిమా మరో వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో గల్ఫ్ దేశాల్లో నివసించే వారి భార్యలను నెగెటివ్‌గా చూపించడంపై ఓ నెటిజన్ అ‍భ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూవీలో హీరోయిన్ నివేదా పేతురాజ్‌ క్యారెక్టర్ అలా నెగెటివ్ కోణంలో చూపించడంపై ఫైరయ్యారు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ ఇలా చూపిస్తారనుకోలేదని అన్నారు. త్రివిక్రమ్‌పై అభిమానంతో సినిమాకు వెళ్తే ఈ సీన్ చూశాక నా గుండె పగిలినంత పనైందని నెటిజన్‌ మండిపడ్డారు. భర్తలు దుబాయ్ గల్ఫ్ దేశాల్లో దూరంగా ఉంటే భార్యలు తప్పు చేస్తారా సార్ అని త్రివిక్రమ్‌ను ప్రశ్నించారు. అయితే.. గతంలో చాలా సినిమాల్లో ఇలానే చూపించడం మనం చూస్తుంటాం.. కానీ త్రివిక్రమ్ సినిమాలో ఇలా చూపడంతో నెటిజన్ ‍ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)