Breaking News

ఆర్‌ సీ17.. ఆశలన్నీ సుకుమార్‌పైనే!

Published on Sun, 11/01/2026 - 13:58

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు చాలామందే ఉన్నారు. కానీ సరైన కథ, బలమైన పాత్ర పడితే బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించే సత్తా ఉన్న హీరోలు కొందరే. అలాంటి వారిలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఒకరు. నటుడిగా తనను తాను నిరూపించుకున్న ఆయన.. గ్లోబల్‌ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కెరీర్‌లో ఎన్ని విజయాలు ఉన్నా.. ప్రస్తుతం మాత్రం చరణ్‌కు మరో భారీ హిట్‌ అవసరం. అందుకే ఇప్పుడు ఆయన ఆశలన్నీ దర్శకుడు సుకుమార్‌పైనే ఉన్నాయి. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న కొత్త సినిమా ఆర్‌సీ 17పై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత మారిన పరిస్థితి
రామ్‌ చరణ్‌ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా ఆయన చేసిన నటన ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సంపాదించారు. ఈ సినిమా సాధించిన విజయంతో చరణ్‌ మార్కెట్‌, ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది.

(చదవండి: ‘సినిమా నచ్చితే మెచ్చుకోండి.. కానీ ట్రోల్స్‌ చేయద్దు’)

అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన నుంచి వచ్చిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మాత్రం భారీ అంచనాలను అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌, స్టార్‌ కాస్ట్‌, రాజకీయ నేపథ్యం.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచింది. దీంతో చరణ్‌ తదుపరి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ తర్వాత భారీ ఆశల మధ్య వచ్చిన ‘పెద్ది’ కూడా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు చరణ్‌ కెరీర్‌కి బ్లాక్‌ బస్టర్‌ అనివార్యం అయింది.

రంగస్థలం మ్యాజిక్‌ మళ్లీ సాధ్యమేనా?
రామ్‌ చరణ్‌ కెరీర్‌లో ‘రంగస్థలం’కు ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకు కనిపించిన చరణ్‌కు భిన్నంగా, చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గోదావరి ప్రాంతపు గ్రామీణ నేపథ్యంలో సాగే కథ, సహజమైన పాత్రలు, భావోద్వేగాలు, బలమైన కథనం.. ఇవన్నీ సినిమాను విజయవంతం చేశాయి.

ఈ చిత్రంతో సుకుమార్‌ దర్శకుడిగా తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. చరణ్‌లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించడంలో ఆయన సఫలమయ్యారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌ అనగానే అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది ‘రంగస్థలం’ చిత్రమే.

అయితే, అప్పటి మ్యాజిక్‌ను మళ్లీ తెరపై ఆవిష్కరించడం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రేక్షకుల అంచనాలు ఇప్పుడు మరో స్థాయిలో ఉన్నాయి. ‘రంగస్థలం’ను మించిన సినిమా ఇవ్వాలనే ఒత్తిడి ఒకవైపు ఉంటే, చరణ్‌కు మరో బ్లాక్‌బస్టర్‌ అందించాలనే బాధ్యత మరోవైపు ఉంది.

చరణ్‌కు హిట్‌ అత్యవసరం
ప్రస్తుతం రామ్‌ చరణ్‌కు  ఒక బ్లాక్‌ బస్టర్‌ చాలా ముఖ్యం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వచ్చిన అంతర్జాతీయ గుర్తింపును కొనసాగించడంతో పాటు, తెలుగు ప్రేక్షకులను మరోసారి బలంగా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఆర్‌సీ 17 కీలకమైన ప్రాజెక్ట్‌గా మారుతోంది.

సుకుమార్‌కు సవాల్‌!
సుకుమార్‌కు కూడా ఇది సాధారణ సినిమా కాదు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత అదే హీరోతో సినిమా చేస్తుండటంతో సహజంగానే పోలికలు తప్పవు. గత చిత్రాన్ని మించిన అనుభూతిని అందించాలనే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే కథ, పాత్రలు, ఎమోషన్స్‌ విషయంలో ఆయన మరోసారి తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది.

అయితే, సినిమా ప్రారంభమైన వెంటనే విజయంపై ఓ అంచనాకు రావడం తొందరపాటే. సినిమా ఫలితాన్ని నిర్ణయించేది చివరకు కథ, తెరకెక్కించిన విధానం, ప్రేక్షకుల ఆదరణే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్‌సీ 17పై ఉన్న అంచనాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మరి సుకుమార్‌.. ఆర్‌సీ 17తో మరోసారి అదే స్థాయి ప్రభావాన్ని చూపిస్తారా? చరణ్‌కు కావాల్సిన బ్లాక్‌బస్టర్‌ను అందిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మెగా అభిమానుల ఆశలన్నీ సుకుమార్‌పైనే ఉన్నాయి. ఈసారి ఆయన ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారో చూడాలి.

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)