Breaking News

సమస్యల్లో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు

Published on Sun, 11/01/2026 - 09:20

రవితేజకు చాన్నాళ్ల నుంచి వరసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. 'ఇరుముడి'తో ఇది బ్రేక్ అయింది. ఏకంగా రూ.250 కోట్ల కలెక్షన్లతో ఈ హీరో బ్లాక్‌బస్టర్ అందుకుని కమ్ బ్యాక్ ఇచ్చాడు. విడుదల తర్వాత ఈ చిత్రం.. ప్రభుత్వ టీచర్ల నుంచి విమర్శలు ఎదుర్కొని వివాదంలో నిలిచింది. ఇప్పుడు ఊహించని విధంగా మరోసారి సమస్యల్లో చిక్కుకుంది. బాలనటి నక్షత్ర విషయమై తెలంగాణ కార్మికశాఖ సినిమా టీమ్‌కి నోటీసులు జారీ చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో కీర్తి సురేశ్‌ ‘అక్క’ రివ్యూ)

‘ఇరుముడి’లో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంపై ప్రశ్నించిన తెలంగాణ కార్మికశాఖ.. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరింది. సినిమా షూటింగ్‌లో బాలిక నటించడానికి ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా? పాప తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా? బాలిక పారితోషికంలో 20 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా? అని తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్.. చిత్ర బృందాన్ని ప్రశ్నించారు.

బాలికకు సంబంధించిన కాల్ షీట్లు, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలు, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా? తదితర వివరాలు స్పష్టం చేయాలని కార్మిక శాఖ ఆదేశించింది. సినిమా ప్రమోషన్ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలిక పాల్గొనేలా చేయడంపై వివరణ ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో నవంబర్ 4 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు నోటీసులలో పేర్కొన్నారు. జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు లేబర్ డిపార్ట్‌మెంట్ ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాకింగ్.. రోహిత్ ఎలిమినేట్)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)