Breaking News

అడ్వాన్స్‌ ఇచ్చి మరీ తీసేశారు.. ప్రకాశ్‌ రాజ్‌ సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 10/31/2026 - 18:28

ప్రకాశ్‌రాజ్‌.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, తండ్రిగా.. ఇలా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు ఆయన. నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే, అలాంటి నటుడు ఇటీవల సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఆయన రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా మాట్లాడటం కూడా ఒక కారణమా? రాజకీయాలపై ప్రకాశ్‌రాజ్‌ వైఖరి ఆయన సినీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపింది? తాజాగా ఆయన భార్య, కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై చర్చకు దారితీశాయి.

ప్రకాశ్‌రాజ్‌ రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ పేరుతో పోస్టులు పెడుతుంటారు. అయితే, ఆయన ఈ వైఖరి సినీ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని భార్య పోనీ వర్మ వెల్లడించారు. రాజకీయాలపై ప్రకాశ్‌రాజ్‌ చేస్తున్న వ్యాఖ్యల కారణంగా ఆయనకు రావాల్సిన సినిమా అవకాశాలతో పాటు ప్రకటనల ప్రాజెక్టులు కూడా దూరమయ్యాయని తెలిపారు.తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోనీ వర్మ ఈ విషయాలను పంచుకున్నారు.

(చదవండి: ఆరేళ్లకే విడాకులు.. సంజయ్‌ గుప్తా లవ్‌స్టోరీ)

‘రాజకీయాలపై ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతుంటే మొదట్లో కొంచెం భయపడేదాన్ని. ఆయన బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని చెందేదాన్ని. కానీ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య ఘటన తర్వాత ‘భయపడుతూ ఎన్నాళ్లు బతకాలి’ అని ప్రకాశ్‌రాజ్‌ అనుకున్నారు. ఈ ఆలోచనలతోనే సామాజిక, రాజకీయ అంశాలపై తన గళాన్ని మరింత బలంగా వినిపించడం ప్రారంభించాడు.

అయతే, దీని వల్ల ఆయనకు రావాల్సిన సినీ అవకాశాలు చేజారిపోయాయి. కొందరు అడ్వాన్స్‌ ఇచ్చిన తర్వాత కూడా సినిమాల నుంచి తీసేసిన సందర్భాలున్నాయి. వృత్తిపరంగా ఆయన ఎంతో నష్టపోయారు. కానీ తన మనస్సాక్షికి తప్పుగా అనిపిస్తే మాత్రం ఆ పనిని ఎప్పటికీ అంగీకరించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు’అని పోనీ వర్మ పేర్కొన్నారు. 

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)