Breaking News

కుక్కకి ఓ రోజు వస్తుంది అంటే ఇదే..!

Published on Sat, 10/31/2026 - 13:52

మన దేశంలో కుక్కని కాలభైరవుడి స్వరూపంగా, విశ్వాసానికి చిహ్నంగా చూస్తారు. పైగా వాటిని పూజనీయమైన వాటిగానే చూస్తాం. అంతవరకే..కానీ ఈ దేశంలో ఏకంగా శునకాల కోసం ప్రత్యేకంగా ఒక పండుగను నిర్వహించి వాటిని పల్లికిలో ఊరేగిస్తారు. అక్కడ ఇది ఎందుకు చేస్తారో తెలిస్తే..విస్తుపోతారు.

చైనాలోని గ్వీజౌ ప్రావిన్స్‌లోని ఒక గ్రామం ఈ శునకాల పండుగను వేడుకగా నిర్వహిస్తుంది. ఇక్కడ కుక్కలకు సాంప్రదాయ మియావో దుస్తులు ధరింపచేసి పల్లకిలో వీధుల గుండా ఊరేగిస్తారు. దీన్ని డాగ్‌ క్యారీయింగ్‌ ఫెస్టివల్‌గా పిలుస్తారు. ఇవి కరువు నుంచి కాపాడుతాయని, ఇవి నీటి జాడని కనగొనడంలో సహాయం చేస్తాయని అక్కడ ప్రజలు విశ్వసిస్తారట. సకాలంలో మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండేందుకు, అలాగే ప్రకృతిపట్ల గౌరవార్థం ఇలా డాగ్‌ ఫెస్టివల్‌ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారట. 

అక్కడ చైనా భాషలో దీన్ని'తాయ్ గౌ జీ' వేడుకగా పిలుస్తారు. ఈ పండుగకు 2015లో సాంస్కృతిక వారసత్వ గుర్తింపు కూడా ఇచ్చారట. ఈ వేడుకలని సమీపంలోని పొలాల్లో నిర్వహిస్తారు. నివాసితులు డప్పులు, నృత్యాలు చేస్తూ..ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ జరుపుకుంటారు. ఒకప్పుడు గ్రామంలో తీవ్ర కరువు ప్రబలినప్పుడు ఊరి గ్రామ పెద్ద కలలో కుక్కకి వేడుక నిర్వహిస్తే వర్షం పడుతుందని వచ్చిందట. అప్పటి నుంచి ఆ ఆచారాన్ని నిర్వహిస్తున్నారని చెబుతుంటారు అక్కడి గ్రామస్తులు. 

మరో కథనం ప్రకారం..తమ పూర్వీకులు నీళ్ల జాడ లేక అవస్థలు పడ్డప్పుడు కుక్కలే వాళ్లకి సహాయం చేశాయని..అందుకు ప్రతిఫలంగా ఇలా డాగ్‌ ఫెస్టివల్‌ని నిర్వహిస్తుంటారని చెబుతుంటారు. ఈ పండుగ ఒకరకంగా జంతువులు, ప్రకృతిపట్ల కృతజ్ఞత చెబుతున్నట్లుగా ఉండటమేగాక..ఒక రకంగా ఈ వేడుక అందర్నీ ఒకచోట చేర్చి ఐక్యంగా ఉండేలా చేయడం విశేషం. 

ఇదీ చదవండి: స్టీమ్‌ రూమ్‌లో కొందరికి రక్తపోటు తగ్గతుంది ఎందుకు? నటి జాన్వీ కపూర్‌ కూడా..
 

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)