Breaking News

జియో దూకుడు.. ఎయిర్‌టెల్‌కు షాక్!

Published on Fri, 10/30/2026 - 17:18

భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో తన హవా కొనసాగిస్తోంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మాత్రమే కాకుండా.. యాక్టివ్ యూజర్లను పెంచుకోవడంలోనూ మిగతా టెలికాం కంపెనీల కంటే ముందుంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తూ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన సెప్టెంబర్ నెల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

TRAI గణాంకాల ప్రకారం.. మెషిన్-టు-మెషిన్ (M2M) కనెక్షన్లను మినహాయిస్తే, సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులు చేరారు. ఇందులో జియో ఒక్కటే 19 లక్షల మందిని తన నెట్‌వర్క్‌లోకి చేర్చుకుంది. అదే సమయంలో ఎయిర్‌టెల్‌కు కేవలం 2 లక్షల మంది కొత్త కస్టమర్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంటే కొత్త వినియోగదారులను సంపాదించడంలో జియో, ఎయిర్‌టెల్ కంటే దాదాపు పది రెట్లు ముందుంది.

మొత్తం సబ్‌స్క్రైబర్ల విషయానికి వస్తే సెప్టెంబర్ చివరి నాటికి జియోకు 51.114 కోట్ల మంది ఉండగా, ఎయిర్‌టెల్‌కు 49.429 కోట్ల మంది ఉన్నారు. మరోవైపు ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో వెనుకబడటానికి దాని రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేయడం కూడా ఒక కారణమని చెబుతున్నారు.

ఆగస్టులో ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్‌ను తొలగించడంతో.. తక్కువ ధరలో రీఛార్జ్ కోరుకునే వినియోగదారులపై ప్రభావం పడినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ మొత్తం 26.9 లక్షల వైర్‌లెస్ కనెక్షన్లను జోడించినప్పటికీ, సాధారణ మొబైల్ వినియోగదారుల సంఖ్య మాత్రం కేవలం 2 లక్షలే పెరిగింది. మిగిలిన కనెక్షన్లలో M2M కనెక్షన్ల వాటా ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. యాక్టివ్ యూజర్ల విషయంలోనూ జియో తన సత్తా చాటింది.

ఇదీ చదవండి: నవంబర్‌ హాలిడేస్.. ఈ రోజుల్లో బ్యాంకులు క్లోజ్!

#

Tags : 1

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)