Breaking News

గిగ్ కార్మికులకు గుడ్‌న్యూస్‌

Published on Fri, 10/30/2026 - 13:46

దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన కోట్లాది మంది గిగ్, ప్లాట్‌ఫారమ్‌ వర్కర్ల (రైడ్ షేరింగ్, ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్ యాప్ భాగస్వాములు) సంక్షేమం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. లేబర్‌ కోడ్స్‌ కింద ‘నేషనల్‌ సోషల్‌ సెక్యూరిటీ బోర్డు’ ఏర్పాటును కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫై చేసింది.

అసంఘటిత రంగానికి చెందిన కార్మికులతో పాటు డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉపాధి పొందుతున్న గిగ్‌ వర్కర్లకు తగిన సామాజిక భద్రతా పథకాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. వాటి అమలు తీరును పర్యవేక్షించడం, ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయడమే లక్ష్యంగా ఈ బోర్డు పనిచేస్తుందని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.

కీలక బాధ్యతలు.. అధికార పరిధి

కొత్తగా నోటిఫై చేసిన ఈ జాతీయ బోర్డుకు విస్తృత అధికారాలు కల్పించారు. అందులో..

  • ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, జీవిత బీమా, వైకల్యం మరియు వృద్ధాప్య పెన్షన్ వంటి కీలక అంశాల్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను సిఫార్సు చేయడం.

  • రాష్ట్రాల స్థాయిలో రికార్డుల నిర్వహణ, కార్మికుల నమోదు ప్రక్రియల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం.

  • సంక్షేమ నిధి (వెల్ఫేర్‌ ఫండ్‌), సంబంధిత ఖాతాల నుంచి జరిగే వ్యయాలను సమీక్షించడం, నిధులు అర్హులైన కార్మికులకు చేరుతున్నాయో లేదో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం.

శ్రామిక శక్తికి చట్టబద్ధమైన గుర్తింపు

ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, బ్లింకిట్.. వంటి వివిధ డిజిటల్ అగ్రిగేటర్లపై ఆధారపడి లక్షల కొద్దీ యువత జీవనోపాధి పొందుతున్నారు. అయితే యాజమాన్యానికి, ఉద్యోగికి మధ్య సంప్రదాయ ఉద్యోగ భద్రత నిబంధనలు లేకుండా పోయింది. దాంతోపాటు వైద్య, ప్రమాద బీమా సౌకర్యాలు సరిగా అందుబాటులో లేవు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లను చట్టబద్ధ శ్రామిక చట్రంలోకి తీసుకువచ్చినట్లయింది.

పరిశ్రమలు, ప్రతినిధులతో భాగస్వామ్యం

ఈ జాతీయ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ప్లాట్‌ఫారమ్ అగ్రిగేటర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పరిశ్రమ రంగాల నిపుణులు సభ్యులుగా ఉంటారని సమాచారం. సామాజిక భద్రతా చట్టం కింద ఏర్పడే ఈ వ్యవస్థ.. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకే రకమైన సామాజిక భద్రతా నెట్‌వర్క్‌ను రూపొందించేందుకు దోహదపడుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిజిటల్ యుగంలో కొత్త శ్రామిక వ్యవస్థకు చట్టబద్ధ రక్షణ, గౌరవప్రదమైన సామాజిక భద్రత లభించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Videos

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..

పెను ముప్పు పొంచి ఉందా? US, UK, జ‌పాన్ జారీ చేసిన రెడ్ అల‌ర్ట్!

అందుకే టీడీపీకి రాజీనామా చేశా... కడప టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జమ్మలమడుగులో హై టెన్షన్ YSRCP నేత కారుపై దాడి

చిలకలూరిపేట ప్రచారంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు!

YSRCP ఏజెంట్ కు ఎన్నికల అధికారి బెదిరింపులు..! ఆడియో వైరల్..

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)