హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?
Breaking News
సొంతూరిలో పల్లెటూరి పిల్లల్లా..ఫ్యాషన్ వేదికపై మోడల్స్‌గా..!
Published on Fri, 10/30/2026 - 12:08
గత కొన్ని రోజులుగా వందలాది మోడల్స్ తమ సొంతూరి నుంచి జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికల వరకు తాము ప్రయాణించిన తీరుని తెలియజేసే వీడియోలను పంచుకున్నారు. అవన్నీ వాళ్లు ఎంత సాధారణ జీవితం నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో అందంగా మెరిశారో తెలియజేస్తాయి.
అత్యంత ఆకర్షణీయమైన రూపం వెనుక ఇంత దూరం ఉందా అనిపిస్తుంది. ఆ స్థాయి నుంచి ప్రపంచ వేదికపై మెరిసేందుకు ఎంత కష్టపడ్డారు, ఎంత దూరం ప్రయాణించారో అర్థమవుతుంది, స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆ వీడియోలన్నీ ఢ్వాలీ పాట “స్వామి పరదేశ్” (Swami Pardesh) నేపథ్యంలో ఆ మోడల్స్ మొదట ఎలా ఉండేవారు, ఆ తర్వాత మోడల్‌గా ఎలా ఉన్నారో చూపిస్తాయి. తమ సొంతూరిలో తన జీవిన విధానం టు ఫ్యాషన్ప్రపంచంలో తన ఆహార్యం మధ్య వ్యత్యాసానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి.
ఆ వీడియోలో పాటలో లయ మారగానే దృశ్యం కూడా మారిపోతుంది. సొతూరులో వాళ్లంతా వాళ్ల పరిసరాలకు అనుగుణమైన జీవిన విధానం, ఇక ఫ్యాషన్ వేదికపై మోడల్‌గా హోయలొలికిస్తూ భలే కలర్ఫుల్గా కనిపిస్తారు.
వీళ్లేనా.. అత్యంత ఖరీదైన డిజైనర్ దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడించింది అనిపిస్తుంది. అందులో ఒకరేమో చపాతీలు, మరొకరు పొలం పనులు, ఇంకొకరు కొబ్బరి కాయలు కొడుతూ సాధారణ జీవితం విధానం గడుపుతున్నట్లు కనిపిస్తారు. అవే ముఖాలు ఫ్యాషన్ వేదికపై మోడల్స్‌లా వైబ్స్ సృష్టిస్తూ స్టైలిష్‌గా మెరుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలపై ఓ లుక్కేయండి మరి..!.
ఇదీ చదవండి: ఆకుపచ్చని చీరలో నీతా అంబానీ రాయల్ లుక్..మైండ్‌బ్లోయింగ్ వజ్రాల నెక్లెస్
Tags : 1