ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్తపడతా!: జాన్వీ కపూర్‌

Published on Fri, 10/30/2026 - 04:07

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ సినిమాలోని అచ్చియమ్మ పాత్రలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటించిన విషయం తెలిసిందే. వెండితెరపై అచ్చియమ్మ పాత్రను చూపించిన తీరుపై అభ్యంతరకరమైన అబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘కాఫీ విత్‌ కరణ్‌ 9’ టాక్‌ షో వేదికగా జాన్వీ కపూర్‌ తాజాగా ఈ అంశంపై స్పందించారు. ‘‘ఆ సినిమా కోసం (పరోక్షంగా ‘పెద్ది’ సినిమాను ప్రస్తావిస్తూ..) నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. అందుకే ఈ అంశంపై నేను ఇప్పటివరకు స్పందించకుండా మౌనంగా ఉండిపోయాను.

కానీ ఈ విషయం గురించి నేనేదైనా మాట్లాడాల్సి వస్తే జరిగిన వ్యవహరంలో కొంచెం నా బాధ్యత కూడా ఉంది. ఆ విషయంలో నాకు కలిగిన బాధ, అపరాధ భావన ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. దక్షిణాది పరిశ్రమలో ముందుగానే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పద్ధతి చాలా అరుదు. అలాగే ఏ సన్నివేశాన్ని ఏ కెమేరా యాంగిల్‌లో చిత్రీకరించాలనే వివరాలను స్క్రిప్ట్‌లో ముందే రాసి పెట్టడం కూడా అరుదుగా జరుగుతుంది. సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు చెప్పినట్లు చేయాలనే వృత్తిపరమైన ఒత్తిడి నాపై ఉంటుంది. ఒక వ్యక్తిని మరీ అసభ్యంగా, ఇబ్బందికరంగా చూపించారా? కథనం లైంగిక దాడులను సమర్థించేలా లేదా ప్రోత్సహించేలా ఉందా? అని ప్రశ్నించుకుంటే... అలానే ఉందనిపించింది.

ఈ సినిమాలోని కథనం సమాజంపై, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తుందో అన్న ఆలోచన నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. నేను ఇలా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, ఇలా మాట్లాడితే జరిగిన దాని తాలూకు బాధ్యతను తప్పించుకుని, ఇతరుల మీదకు నెట్టేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే నాకు పెద్ద సినీ బ్యాగ్రౌండ్‌ ఉంది. ఆ పలుకుబడిని ఉపయోగించుకుని కాస్త మార్చడానికి (తన పాత్రని చూపించిన విధానాన్ని ఉద్దేశించి) నేను గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది. ఇక నేను భవిష్యత్‌లో చేయగలిగింది ఒక్కటే. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్తపడటమే’’ అని పేర్కొన్నారు.

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)