ఊరిస్తున్న బంగారం.. వెండి.. ఈ పండుగకి ఏది కొనొచ్చు?

Published on Thu, 10/29/2026 - 20:00

దీపావళి పండుగ వచ్చేస్తోంది. అందరూ అప్పుడే షాపింగ్‌ స‌ందడి మొదలైపోయింది. అయితే బంగారం, వెండి కొనేవాళ్లకు మాత్రం రెండు రోజులు మందే అస‌లైన పండుగ వస్తుంది. అదే ధనత్రయోదశి (ధంతేరాస్‌). వచ్చే నవంబర్‌ 6న ధనత్రయోదశి రావడంతో బంగారం, వెండి కొనుగోళ్లకు చాలామంది సిద్ధమవుతున్నారు. అయితే పరిమిత బడ్జెట్‌తో పెట్టుబడి పెట్టాలనుకునేవారు బంగారం కొనాలా.. వెండి కొనాలా? అని ఆలోచిస్తున్నారు. ధరల ఒడుదొడుకులు, కొనుగోలు ఖర్చులు, అవసరమైనప్పుడు విక్రయించే సౌలభ్యం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం.. దీర్ఘకాలిక భద్రతకు ప్రాధాన్యం

భారతీయులకు బంగారంతో సంప్రదాయ అనుబంధం ఉండటమే కాకుండా, పెట్టుబడి సాధనంగానూ దీనికి మంచి గుర్తింపు ఉంది. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేసినప్పుడు కొందరు పెట్టుబడిదారులు బంగారంవైపు మొగ్గుచూపుతుంటారు. సాధారణంగా వెండితో పోలిస్తే బంగారం ధరల హెచ్చుతగ్గులు తక్కువగా ఉండే సందర్భాలు ఉన్నాయి. అయితే బంగారం ధరలు కూడా గణనీయంగా పడిపోవచ్చనే విషయాన్ని మర్చిపోకూడదు.

భౌతిక బంగారం కొనాలనుకునేవారు ఆభరణాలు, నాణేలు, కడ్డీల మధ్య తేడాలను గమనించాలి. ఆభరణాలకు తయారీ ఛార్జీలు, వర్తించే పన్నులు అదనంగా ఉంటాయి. తిరిగి విక్రయించే సమయంలో ఈ ఛార్జీలన్నీ తిరిగి రావు. అందువల్ల ఆభరణాల కంటే పెట్టుబడి కోసమే కొనుగోలు చేసేవారు నాణేలు లేదా కడ్డీలను పరిశీలించవచ్చు. వాటి స్వచ్ఛత, విక్రయ నిబంధనలు, ధరలోని అదనపు ఛార్జీలను ముందుగానే తెలుసుకోవాలి.

వెండి.. తక్కువ బడ్జెట్‌తో కొనొచ్చు..

చిన్న మొత్తంతో విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి వెండి అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయం. సౌర విద్యుత్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహనాల తయారీలో వెండిని వినియోగిస్తుండటంతో పారిశ్రామిక రంగం నుంచి దీనికి డిమాండ్‌ లభిస్తోంది. అయితే పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల ఆసక్తి రెండూ ధరలను ప్రభావితం చేస్తాయి. దీంతో వెండి ధరలు కొన్నిసార్లు వేగంగా పెరగడంతోపాటు, అదే స్థాయిలో తగ్గే ప్రమాదమూ ఉంటుంది.

భౌతిక వెండి కొనుగోలులోనూ కొన్ని అంశాలను పరిశీలించాలి. బంగారంతో పోలిస్తే తక్కువ ధరకు ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయగలిగినా, నిల్వ చేయడం కాస్త ఇబ్బంది కావచ్చు. కొనుగోలు ధరకు, తిరిగి విక్రయించే ధరకు మధ్య వ్యత్యాసం ఎంత ఉందో తెలుసుకోవాలి. స్వచ్ఛత, అదనపు ఛార్జీలు, విక్రయ సమయంలో వర్తించే నిబంధనలను పోల్చిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిది.

ఇదీ చదవండి: అమ్మ బంగారం అమ్మి డబ్బులిస్తే ట్యాక్స్‌ కట్టాలా?

ఈటీఎఫ్‌లూ పరిశీలించవచ్చు

బంగారం, వెండిని ఇంట్లో నిల్వ చేయడం ఇష్టం లేనివారు ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)ను ‍ప్రయత్నించవచ్చు. ఇవి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్ల మాదిరిగా కొనుగోలు, విక్రయాలు చేయగలిగే పెట్టుబడి సాధనాలు. బంగారం లేదా వెండి ధరల కదలికలకు అనుగుణంగా వీటి విలువ మారుతుంది. భౌతిక బంగారం, వెండికి ఉన్నట్లు వీటికి నిల్వ, దొంగతనం, స్వచ్ఛతకు సంబంధించిన సమస్యలు ఉండవు. అయితే ఈటీఎఫ్‌లలోనూ ధరల మార్పుల వల్ల నష్టాలు సంభవించవచ్చు.

ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్‌ ఖాతా అవసరం. బ్రోకరేజ్‌ ఛార్జీలు, ఫండ్‌ నిర్వహణ వ్యయాలు, కొనుగోలు ధరకు నికర ఆస్తి విలువకు (ఎన్‌ఏవీ) మధ్య వ్యత్యాసం వంటి అంశాలను గమనించాలి. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పథకం పత్రాలను చదవాలి. అలాగే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రభుత్వ విధానాల ప్రభావానికి లోనవుతాయని గుర్తుంచుకోవాలి.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)