భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..
Breaking News
ఏపీలో తుపాను.. బాధితుల కోసం స్టార్ హీరో కీలక నిర్ణయం!
Published on Thu, 10/29/2026 - 09:04
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 29న ఈ వేడుకను నిర్వహించాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విరమించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
బాధితులకు అండగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్‌లో తుపాను సృష్టించిన బీభత్సం తనను కలచివేసిందని విశ్వక్‌సేన్ పేర్కొన్నారు. ఎంతోమంది కుటుంబాలు ఈ విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో సినిమా వేడుకలు నిర్వహించడం సరైన నిర్ణయం కాదని భావించినట్లు చెప్పారు. అందుకే ‘కల్ట్’ ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘లెట్స్ స్టాండ్ విత్ ఏపీ’ అంటూ తుపాను బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ట్రైలర్ విడుదలలో మార్పు లేదు
ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినప్పటికీ సినిమా ప్రచార కార్యక్రమాలపై విశ్వక్‌సేన్ స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 29న ప్రెస్‌మీట్ నిర్వహించి ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని సమాచారం. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
(ఇదీ చదవండి: పెద్దిలో ఆ సీన్లు.. గిల్టీగా ఫీల్ అయ్యా: జాన్వీ కపూర్)
Let’s stand with AP . #CULT https://t.co/dS14kYwOPx
— VishwakSen (@VishwakSenActor) October 28, 2026
Tags : 1