Breaking News

అమ్మ పాత్ర అని నో చెప్పాలనుకోలేదు: శ్రీనిధీ శెట్టి

Published on Tue, 10/27/2026 - 04:17

‘‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’, ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ చిత్రాలకు మంచి విజయం లభించింది. కానీ, ఆ తర్వాత నేను చేసిన తమిళ చిత్రం ‘కోబ్రా’కు ఆశించిన స్థాయిలో ప్రేక్షక    ఆదరణ లభించలేదు. ఇలా కెరీర్‌ స్టార్టింగ్‌లోనే సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను చూడగలిగాను. ఒక సినిమా హిట్‌ కావడం అనేది మన చేతుల్లోనే లేదని తెలుసుకున్నాను. కంటెంట్‌ పరంగా నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ‘ఆదర్శ కుటుంబం’ కూడా నా మనసుకి నచ్చి ఎంపిక చేసుకున్న సినిమానే’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు.

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆదర్శ కుటుంబం– హౌస్‌ నెం.47’. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నాది అమ్మ పాత్ర అని నో చె΄్పాలనుకోలేదు. వెంకటేశ్, త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్  అంటేనే స్పెషల్‌. అందుకే ఈ చిత్రంలో కచ్చితంగా భాగం కావాలనుకున్నాను. 

వెంకటేష్‌గారు అద్భుతమైన యాక్టర్‌. ఆయన కామెడీ టైమింగ్‌ కానీ, ఎమోషనల్‌ యాక్టింగ్‌ కానీ చాలా గొప్పగా ఉంటాయి. ఆయన్ను మ్యాచ్‌ చేయడం సాధ్యం కాదు. కానీ, త్రివిక్రమ్‌గారి సూచనలతో నా వంతుగా ప్రయత్నించాను. ‘హిట్‌ 3’ చిత్రంలో కొంత యాక్షన్  చేశాను. ‘ఆదర్శ కుటుంబం’లోనూ కొంత యాక్షన్  చేసే అవకాశం లభించింది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్‌ చె΄్పాను. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్ లో సినిమా చేయడం సంతోషాన్నిచ్చింది. ‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర కోసం నేను ఆడిషన్  ఇచ్చాను. కానీ, సాయిపల్లవిగారు ఫైనలైజ్‌ అయ్యారు. ప్రస్తుతం కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అని తెలిపారు.

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)