Breaking News

పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే ఇలా తయారయ్యారేంట్రా?

Published on Sun, 10/25/2026 - 17:08

టాలీవుడ్‌లో మోస్ట్ క్రష్‌ ఉన్న జంటల్లో విజయ్-రష్మిక ముందుటారు. వీరిద్దరు ఈ ఏడాదిలోనే పెళ్లిపీటలెక్కారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్‌ వెడ్డింగ్‌లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాల సభ్యలు సందడి చేశారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేక రిసెప్షన్‌ వేడుక ఏర్పాటు చేశారు విరోష్ జంట. వీరిద్దరు పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం రణబాలి. ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది.

ఈ సంగతి పక్కనపెడితే సెలబ్రిటీలపై తరచుగా గాసిప్స్, రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి ఉంటుంది. పెళ్లి నుంచి విడాకుల వరకు సెలబ్రిటీలపై ఏదో ఒక సందర్భంలో వార్తలు వస్తుంటాయి. అలా విజయ్- రష్మిక విషయంలోనూ అదే జరుగుతోంది. విరోష్ జంట పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. పెళ్లై కొన్ని నెలలు కూడా గడవకముందే ఈ జంట విడిపోతోందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది.

విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికను అన్ ఫాలో చేశాడని కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అసలు విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో అవ్వడం లేదు. కానీ.. రష్మికను మాత్రమే ఫాలో అవ్వడంలేదని.. ఆమెను కొత్తగా అన్ ఫాలో చేసినట్లుగా ఫేక్ ప్రచారం మొదలెట్టారు. దీంతో అసలు మన సమాజం ఎటు పోతోందన్న చర్చ మొదలైంది.

ఈ ఫేక్ ప్రచారంపై విజయ్, రష్మిక అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీరిద్దరు తమ జీవితాన్ని తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంటే ఇలాంటి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ వివాదంగా మార్చడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. కేవలం సోషల్ మీడియా ఆధారంగా బంధాలను జడ్జ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని సోషల్ మీడియా వేదికగా గడ్డి పెడుతున్నారు.

కాగా.. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పెళ్లి ప్రపోజల్ గురించి చర్చ వచ్చినప్పుడు.. రష్మిక తనను పెళ్లి చేసుకోమని వందసార్లు అడిగిందని విజయ్ చెప్పారు. ఆ తర్వాతే పెళ్లికి ఓకే చెప్పానని విజయ్ వెల్లడించారు. దాదాపు ఏడాది పాటు పెళ్లి గురించి ప్రస్తావించిందని విజయ్ తెలిపారు. దీంతో కొందరు విజయ్‌ను ‘రెడ్ ఫ్లాగ్’ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారనే విషయాన్ని కూడా హాట్‌ టాపిక్‌గా మార్చేశారు.  
 

Videos

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

సింధు, హంపిలకు.. YS జగన్ అభినందనలు

అర్నాబ్ హెచ్చరిక.. ఏపీ ప్రయాణం వాయిదా వేసుకోండి

పెద్దారెడ్డి ఇంటిపై దాడి.. బయటపడ్డ జేసీ రౌడీలా వీడియో

పులివర్తి నాని గుండా రాజ్యం తమిళనాడు నుంచి రౌడీలు

నరకానికి దారి.. గుంతల్లో ఇరుక్కుపోయిన బండి

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)