Breaking News

బంగారం పడితే భయమెందుకు? కియోసాకి కీలక సూచన

Published on Sun, 10/25/2026 - 14:07

ప్రముఖ ఇన్వెస్టింగ్‌ గురూ, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి బంగారం ధరల హెచ్చుతగ్గులు, ఇన్వెస్టర్ల వైఖరిపై తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీ వంటి వస్తువులపై డిస్కౌంట్లు వస్తే కొనుగోలుదారులు ఎగబడతారని, అదే బంగారం ధర గరిష్ఠ స్థాయి నుంచి 25 శాతం తగ్గితే మాత్రం భయపడి పెట్టుబడుల నుంచి వెనక్కి తగ్గుతారని పేర్కొన్నారు. సంపదను పెంచుకోవడానికి కొనుగోలు చేసే ఆస్తుల ధరలు తగ్గినప్పుడు కూడా వాటిని చూసే విధానంలో మార్పు రావాలని సూచించారు.

రిటైల్‌ కొనుగోలుదారులు టీవీపై 10 శాతం తగ్గింపు వస్తే సుమారు 40 డాలర్లు ఆదా చేసేందుకు ఆసక్తి చూపిస్తారని కియోసాకి ఉదాహరణగా చెప్పారు. అయితే, బంగారం ధర 25 శాతం పడిపోయినప్పుడు మాత్రం దానిని ప్రమాదకరమైన పెట్టుబడిగా భావించి విక్రయించేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. ధర తగ్గిందనే కారణంతోనే ఒక పెట్టుబడిని మంచిదని నిర్ణయించలేమని, అదే సమయంలో ధర తగ్గిందని మాత్రమే దాని నుంచి దూరంగా ఉండటం కూడా సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.

బంగారం ధరపై బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనాలు

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి తన అభిప్రాయాలను వివరించారు. నివేదిక ప్రకారం, 2026 నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల స్థాయి వద్ద ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బ్యాంక్‌ అంచనా వేసింది. అయితే, 2027 రెండో, మూడో త్రైమాసికాల్లో అదే బంగారం ధర ఔన్స్‌కు 5,000 డాలర్లకు చేరవచ్చని అంచనా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ధర తగ్గితే పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలి

బంగారం ధరలు పడిపోయినప్పుడు పెట్టుబడిదారులు ఆందోళన చెందకుండా, ధరల తగ్గుదలకు గల కారణాలను విశ్లేషించాలని కియోసాకి సూచించారు. బంగారం కొనుగోలు చేయడానికి గతంలో ఉన్న దీర్ఘకాలిక కారణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా? మార్కెట్‌ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? అనే అంశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. కేవలం ప్రతికూల వార్తలు చూసి నిర్ణయాలు తీసుకోవడం కంటే, పెట్టుబడి వెనుక ఉన్న ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

ఔన్స్‌ బంగారం 10,000 డాలర్లకు చేరుతుందా?

ఇదే పోస్ట్‌లోని మరో భాగంలో బంగారం ధర భవిష్యత్తుపై భారీ అంచనాలు ప్రస్తావించారు. ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత జిమ్‌ రికర్డ్స్‌ అభిప్రాయాలను వినాలని పాఠకులకు సూచిస్తూ, రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్స్‌కు 10,000 డాలర్లకు చేరవచ్చనే అంచనాను పేర్కొన్నారు.

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)