AIతో బుక్ రాయండి.. అవార్డు గెలుచుకోండి!

Published on Fri, 10/23/2026 - 13:56

పుస్తకాలు రాయాలంటే మంచి ఆలోచనలు, భాషపై పట్టు, సృజనాత్మకత ఉండాలి. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే ఏఐ రాక దాదాపు అన్ని రంగాల్లోనూ.. ఊహకందని మార్పులు తీసుకొస్తోంది. కథలు రాయడం నుంచి నవలలు రూపొందించడం వరకు ఏఐని ఉపయోగిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఏఐ సాయంతో రాసిన పుస్తకాలకు కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఈ పోటీలో గెలిచిన రచయిత పుస్తకాన్ని ప్రచురించే అవకాశం కూడా కల్పించనుంది.

ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్తలు ఫిలిప్‌ రోడ్రిగ్జ్‌, అల్బిన్‌ సర్వియంట్‌, గిలెస్‌ మెంట్రే కలిసి కొత్త సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు. దీనికి ‘ప్రిక్స్‌ పాస్కల్‌ డి లిటరేచర్‌ ఐఏ’ (Prix Pascal de Littérature IA) అని పేరు పెట్టారు. ఈ అవార్డు లక్ష్యం ఏమిటంటే.. మానవుల సృజనాత్మకతకు ఏఐని జోడిస్తే ఎలాంటి మంచి రచనలు చేయవచ్చో చూపించడమే.

ఈ పోటీ ఎందుకంటే?
ఈ పోటీలో ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన రచయితలైనా పాల్గొనవచ్చు. అయితే.. వారు రాసే పుస్తకాలు మాత్రం ఫ్రెంచ్‌ భాషలో ఉండాలి. కథలు రాయడానికి చాట్‌జీపీటీ, క్లౌడ్, జెమినీ, లామా వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే.. ఏఐని ఎలా ఉపయోగించారు?, రచనలో దాని పాత్ర ఎంత? అనే విషయాలను నిర్వాహకులకు తప్పకుండా తెలియజేయాలి.

ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు ఇంతకుముందు ప్రచురించని సొంత రచనలను సమర్పించాలి. పుస్తకంలో కనీసం 10 వేల పదాలు, గరిష్ఠంగా 50 వేల పదాలు ఉండాలి. సమాజంలో ఎదురవుతున్న సమస్యలు, నైతిక విలువలు, పర్యావరణ సవాళ్లు వంటి అంశాలపై రాసిన కథలకు నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

పది పుస్తకాలకు అవార్డు
ఈ అవార్డు కోసం అక్టోబర్‌ 20, 2026 నుంచే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. నవంబర్‌ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన రచనల్లో పది పుస్తకాలను ఎంపిక చేసి, డిసెంబర్‌లో విజేతను ప్రకటించనున్నారు. విజేత రచనకు అవార్డుతో పాటు, ప్రచురణకు అవకాశం కూడా లభిస్తుంది.

ఈ పురస్కారానికి బ్లేజ్‌ పాస్కల్‌ పేరు పెట్టడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త. విజ్ఞానశాస్త్రం, గణితం, ప్రారంభ కంప్యూటింగ్‌ రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఏఐతో రాసిన పుస్తకాలకు అవార్డ్స్ అవసరమా?
ఏఐతో కథలు, నవలలు రాయడం ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. అయితే అలా రాసిన రచనలకు సాహిత్య పురస్కారాలు ఇవ్వాలా? అనేది చాలామంది మదిలో ఉన్న ప్రశ్న.

దీనికి పలువురు పలు విధాలుగా తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నారు. ఏఐ వల్ల రచయితలకు కొత్త ఆలోచనలు వస్తాయని, కథలను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవచ్చని కొందరు అంటున్నారు. ముఖ్యంగా రాయాలనే ఆసక్తి ఉన్నా, భాషపై పూర్తి పట్టు లేనివారికి ఏఐ ఉపయోగపడుతుందని కొందరు భావిస్తున్నారు.

ఏఐపై ఎక్కువగా ఆధారపడితే రచయితల సొంత ఆలోచనలు, ప్రత్యేకమైన రచనా శైలి తగ్గిపోయే ప్రమాదం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల అనుభవాలు, భావోద్వేగాలు, జీవితంలో ఎదురయ్యే సంఘటనల నుంచి పుట్టే సృజనాత్మకతను యంత్రాలు పూర్తిగా అందించగలవా? అన్న సందేహాలు కూడా పుడుతున్నాయి.

కొత్త అవార్డు వెనుక ఉద్దేశ్యం
నిజానికి ఈ కొత్త అవార్డు వెనుక ఉన్న ప్రధాన ఆలోచన రచయితలను పక్కన పెట్టడం కాదు. వారికి ఏఐని మరో సాధనంగా అందించడం. రచయిత తన ఆలోచనలతో కథను రూపొందించి, అవసరమైన చోట ఏఐ సాయం తీసుకోవచ్చు. అయితే ఆ సాయం ఎంతవరకు ఉపయోగించుకున్నారో వెల్లడించడం ఈ పోటీలో ముఖ్యమైన నిబంధన. భవిష్యత్తులో పుస్తకాలను అంచనా వేసేటప్పుడు వాటి కథాంశం, భాష, భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇస్తారా?, లేక వాటిని రాయడానికి ఉపయోగించిన సాంకేతికతను కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి: గోల్డ్ మార్కెట్‌లో సంచలనం.. కుప్పకూలిన ధరలు!

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)