ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి..కానీ అలా చేయొద్దు..! హాట్‌టాపిక్‌గా గవర్నర్‌ వ్యాఖ్యలు

Published on Fri, 10/23/2026 - 09:39

ఉత్తరప్రదేశ్‌ యూపీ గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్ యువతను ఉద్దేశిస్తూ గతంలో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఆమె సదా యువతకు మంచి దారిలో వెళ్లమని, లివ్‌ఇన్‌ సరైనది కాదంటూ హితవు పలుకుతుంటారామె. అలాగే మహిళలు బాధ్యతలు గురించి కూడా చెబుతుంటారు. మంచి తల్లిగా ఉంటేనే మంచి సమాజాన్ని నిర్మించగలమని పిలుపనిచ్చారు గతంలో. మళ్లీ తాజాగా  యువతను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ బాధ్యతరాహిత్యంగా ఉండొద్దని ప్రేమించేటప్పుడే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అంటూ కొన్ని సూచనలందించారు. అవేంటో చూద్దామా..!

ఇవాళ యువత ఎంత దారుణంగా మారిందో ఏకరవు పెట్టారామె. ప్రతి ఒక్కళ్లు అబ్బాయిలు ప్రేమిస్తున్నారు. ఆమె తన గర్ల్‌ఫ్రెండ్‌ అని గర్వంగా తన స్నేహితులకు చెబుతారు. అంతా బాగానే ఉంటుంది. ఆకర్షణలో మోజులో తప్పు కూడా చేసేస్తారు. ఆ తర్వాత తీరిగ్గా నీతి కబుర్లు చెబుతూ..ఆమెని తల్లిని చేసి ఒంటిరిగా వదిలిపెట్టేస్తారు. ఇది క్షమించరాని తప్పు అని నొక్కి చెప్పారు ఆనందీ చెన్‌. ప్రేమిస్తే ప్రేమించండి తొందరపడి ఆ తప్పు చేయకండి. ఆర్థిక స్థిరత్వం అత్యంత ముఖ్యం. చక్కగా జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్‌ని లీడ్‌ చేయండి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. అంతేగానీ ప్రేమ పేరుతో ప్రియురాలిని తల్లిని చేసి, మోసం చేసే సాహసం చేయొద్దు. 

లేదా ఆమె బాధ్యతలను కచ్చితంగా స్వీకరించాలనుకుంటేనే..ప్రేమించండి. బాధ్యతగా వ్యవహరించలేను అనుకుంటే..ప్రేమ జోలికి వెళ్లొద్దని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. తమ కాళ్లపై నిలబడి..కుటుంబాన్ని నడపగలిగే సామర్థ్యం తెచ్చుకున్నాక ధైర్యంగా పెళ్లి చేసుకుని పిల్లలను కనండి..అంతే తప్ప ఒక అమ్మాయిని వంచించి, మోసం చేసే ప్రయత్నానికి పూనుకోకండని అన్నారామె. అది సర్వ విధాల అనర్థదాయకమైందని హితవు పలికారామె. ఆనందీబెన్‌ కుటుంబ విలువలు, మహిళల ప్రాధాన్యతల గురించి మాట్లాడుతుంటారు. ఆమె చెప్పింది సమంజసమైందే అయినా..కొందరూ మాత్రం ఆమె చెప్పే మాటలు మహిళలను కించపరిచే విధంగా, అణిచివేసే విధంగా ఉంటాయని దుమ్మెత్తిపోస్తుంటారు. ​

కాగా, ఆనందీ బెన్‌..జీవితంలో మంచిగా సెటిల్‌ అయ్యి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోండి అంతేగానీ తల్లిని వదిలేయొద్దని ఆ కారణంగా అనాథలుగా మారి ఆశ్రమాల్లో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఒక్కసారి అలాంటి శరణాలయాలకు వెళ్లి చూడండి పరిస్థితి మీకే తెలుస​ఉతంది అంటూ సందేశాత్మకంగా మాట్లాడారామె.

ఇదీ చదవండి: కూమార్తె పెళ్లిలో సెన్సెషన్‌గా 41 ఏళ్ల తండ్రి..! కాబోయే అల్లుడు సైతం..

 

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)