ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్
Breaking News
సన్నీ లియోన్ కొత్త కారు: ధర తెలిస్తే షాకవుతారు!
Published on Tue, 10/20/2026 - 13:49
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన కార్ల కలెక్షన్‌లోకి మరో లగ్జరీ ఎస్‌యూవీని చేర్చారు. ఆఫ్‌రోడింగ్‌కు పేరుగాంచిన జీప్ రాంగ్లర్ రూబికాన్‌ను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికాలోని టెక్సాస్‌లో ఈ కారును తీసుకున్న సన్నీ లియోన్, తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. తెలుపు రంగులో ఉన్న ఈ కారు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. భారత మార్కెట్లో జీప్ రాంగ్లర్ ప్రారంభ ధర రూ.72.30 లక్షలు(ఎక్స్‌షోరూమ్).
జీప్ రాంగ్లర్ రూబికాన్ స్పెషాలిటీ కేవలం దాని లుక్ కాదు. ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం కూడా. కఠినమైన రోడ్లు, కొండ ప్రాంతాలు, ఇసుక మార్గాల్లో ప్రయాణించేందుకు వీలుగా కంపెనీ దీనిని రూపొందించింది.
సన్నీ కొనుగోలు చేసిన ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మోడల్ అని సమాచారం. ఇది 270 హార్స్‌పవర్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఈ SUV క్లిష్టమైన రోడ్లపై కూడా మంచి పనితీరును అందిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 9 స్పీకర్ల ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, రిమోట్ స్టార్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మంచి డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో ఈ కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ జీ-వాగన్ వంటి వాటికి పోటీగా నిలుస్తుంది. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అమెరికా వెర్షన్‌లోని ఫీచర్లు భారతదేశంలో విక్రయించే మోడల్‌తో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి.
ఇదీ చదవండి: ఎగిరే కారు కోసం బుకింగ్స్ స్టార్ట్!
కాగా ఇప్పటికే.. సన్నీ లియోన్‌కు గ్యారేజిలో.. జీప్ రాంగ్లర్‌తో పాటు మసెరటి క్వాట్రోపోర్టే, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ5, ఎంజీ గ్లోస్టర్ వంటి కార్లు ఉన్నట్లు సమాచారం.
Tags : 1