Breaking News

అక్కడ మగవాళ్లు చీరలు ధరించి గర్బా నృత్యం..! 200 ఏళ్ల నుంచి ఇప్పటికీ..

Published on Tue, 10/20/2026 - 12:51

గుజరాత్‌లో నవరాత్రి వేడకలు గర్బా నృత్యాలతో కోలాహలంగా ఉంటాయి. కానీ అహ్మదాబాద్‌లోని షాహ్‌పూర్‌ మాత్రం ఇందుకు అత్యంత విభిన్నం. పురుషులు, స్త్రీలు అనే తారతమ్యం లేకుండా అందరు గర్బా నృత్యంలో పాల్గొంటారు. కానీ ఇక్కడ మాత్రం మగవాళ్లు స్త్రీల వేషధారణలో గర్బా నృత్యం ఆడటం విశేషం. ఇలా ఎందుకు చేస్తున్నారు?, ఈ ఆచారం వెనుక ఉద్దేశ్యం ఏంటి అంటే..

దేవినవరాత్రులు ఒక్కోచోట ఒక్కో ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కానీ అహ్మదాబాద్‌ మాత్రం ప్రాయశ్చిత్తం, క్షమాపణలsy అమ్మవారి వేడుకలు నిర్వహించడం విశేషం. ఇక్కడ మగవాళ్లు నవారాత్రుల్లోని ఎనిమిదవ రోజు మగవాళ్లు స్త్రీల వేషధారణలో గర్బా నృత్యం చేస్తారు. చిన్న పిల్లవాడి నుంచి అందరు చీరలు ధరించి ఈ గర్బా నృత్యంలో పాల్గొంటారు. ఈ ఆచారాన్ని 200 ఏళ్ల నాటి నుంచి పాటిస్తుండటం విశేషం. ఇంతకీ ఎందుకిలా అంటే..

ఆచారం వెనుకున్న కథ..
సుమారు 200 ఏళ్ల క్రితం 1872లో బరోట్‌ వంశానికి చెందిన సాధుమాత అత్యంత అందమైన మహిళ ఉండేది. ఆమె అందానికి మోహవశుడే అప్పటి పాలకుడు ఆమెను బలవంతంగా తీసుకురమ్మని సైనికులకు ఆదేశాలు పంపాడు. బరోట్‌ సమాజ సభ్యులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను పంపించేందుకు ఇష్టపడకపోవడంతో. పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చూస్తుండగానే అది కాస్తా తీవ్ర రూపం దాల్చింది. అది చూసి అందాల బొమ్మ తల్లిదండ్రలు కోపోద్రేకులై..ఇంత వినాశం కంటే తమ కూతురే చనిపోతే మంచిదని భావించారు. 

దాంతో ఆమె తల్లి మనసు రాయి చేసుకుని తన భర్తను పిలిచి ఒక్కవేటుతో కూతురుని హతమార్చమని చెబుతోంది. అలా సాధుమాత కన్నతల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతుంది. ఆనాటి నుంచి తమ కళ్లముందే పెరిగిన ఆమెను కాపాడుకోలేకపోయమనే బాధ బరోట్‌ వాసులను వెంటాడింది. అదీగాక ఆ అందాలరాశీ మరణానంతరం అక్కడ మగవాళ్లు, మగపిల్లలు చిన్న వయసులనే అకాలంగా మరణించడం ఎక్కువై వంశం క్షీణించిపోవడం ప్రారంభమైంది. 

ఆ సౌందర్యవతి శాపమే వెన్నాడుతుందని భావించారు అక్కడి ప్రజలు. దాంతో సాధుమాత గౌరవార్థం స్థాపించిన ‘సాదు మాత ని పోల్’ ఆలయ ప్రాంగణం వద్ద పురుషులంతా మగవాళ్ల అలంకరణలో గర్భా నృత్యం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి మగవాళ్ల అకాల మరణాలు తగ్గిపోయాయి. దాంతో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకల్లో ఎనిమిదో రోజున ఇలా సాదు మాత ని పోల్ స్త్రీల వేషధారణలో మగవాళ్లు గర్బా నృత్యం చేయడం ప్రారంభించారు. 

ఇది ఒకరకంగా ప్రాయశ్చిత్తం, క్షమాపణలు కోరుతూ చేసే ఆచారం. ఈ ఆచారం వెనుక స్త్రీల రక్షణను గుర్తు చేయడమే గాక, త్యాగం, క్షమాపణల విలువలను తెలియజేసే సంప్రదాయంగా చెప్పొచ్చు. విచిత్రం ఏంటంటే తరతరాలుగా అక్కడ బరోట్ వాసులు పాటించడం విశేషం. చదువుకుని వేరేప్రాంతాల్లో స్థిరపడినా..ఈ వేడుకు జరిగే సమయానికి తమ ప్రాంతానికి చేరుకుని ఈ సంప్రదాయన్ని పాటిస్తుంటారట.

 

ఇదీ చదవండి: నవరాత్రుల సమయంలోనే తెరుచుకునే అమ్మవారి ఆలయం..! రక్షగా నాగుపాము..

 

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)