Breaking News

గరివిడి లక్ష్మి.. ‘పికిలి పిట్టకు పీక సన్నము’ పాట అర్థం ఇదే!

Published on Mon, 10/19/2026 - 16:34

తెలుగు జానపద పాటలకు ఉండే ప్రత్యేకతే వేరు. వినసొంపైన పదాలు, చమత్కారమైన పోలికలు, గ్రామీణ యాసతో సాగే పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ‘గరివిడి లక్ష్మి’ సినిమాలోని ‘పికిలి పిట్టకు పీక సన్నము.. ఉర్ల భామకు ఉరకలందము.. ఆడదానికి అలకలందము’ అంటూ సాగే పాట కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే కొంతమందికి ఈ సాంగ్‌ అర్థంకాకపోవడంతో ఈ పాటలోని పదప్రయోగం, పోలికలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

పాటలోని పోలికల ప్రత్యేకత ఇదే!
ఈ పాటలో అమ్మాయి అందాన్ని ప్రకృతిలోని జీవులతో పోలుస్తూ చమత్కారంగా వర్ణించారు. పికిలి పిట్టకు సన్నని మెడ అందమైతే, ఉత్సాహంగా, చురుగ్గా ఉండే అమ్మాయిల కదలికలను మరో పోలికతో చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ‘ఆడదానికి అలకలందము’ అంటూ అమ్మాయిల అలకను కూడా అందమైన లక్షణంగా అభివర్ణించారు. సాధారణంగా కనిపించే విషయాలను సరదాగా, లయబద్ధమైన పదాలతో చెప్పడం ఈ పాటలోని ప్రత్యేకత. గ్రామీణ జీవితంలో వినిపించే మాటలు, స్థానిక యాసను గుర్తుచేసే పదాలు పాటకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి.

సోషల్ మీడియాలో ఎందుకింత ఆసక్తి?
జానపద పాటల్లో పదాల ఎంపిక, వాటి వెనుక దాగి ఉండే భావాలు శ్రోతలను ఆకట్టుకుంటుంటాయి. ఈ పాటలోని వినూత్నమైన పోలికలు కూడా అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్నాయి. పాడుకోవడానికి సులభంగా ఉండే పదాలు, చమత్కారమైన వర్ణన పాటకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. అయితే కొంతమందికి ఈ పాట అర్థం తెలియక నెట్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. 

సినిమా విషయానికి వస్తే.. 
ఉత్తరాంధ్రలో బుర్రకథలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా 'గరివిడి లక్ష్మి '. పీపుల్స్ మీడియా నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో ఆనంది కీలక పాత్రలో నటించారు. ఆనందితో పాటు రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, రాశి తదితరులు కీలక పాత్రలు చేశారు. 90స్ లో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవిత కథ ఈ సినిమా.

(ఇదీ చదవండి: జైలర్‌-2.. రజనీ మనవడికి రెమ్యునరేషన్‌ ఎంతంటే?)

 

 

 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)