అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఆ ప్రశాంతతని మాటల్లో వివరించలేను.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
Published on Sun, 10/18/2026 - 21:24
విజయ్ దేవరకొండ-రష్మిక దంపతులు రెండు మూడు రోజుల క్రితం పుట్టపర్తి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ప్రదేశానికి వెళ్లొచ్చిన తర్వాత తాను పొందిన అనుభూతిని రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది. పోస్ట్ పెట్టి భావోద్వేగానికి గురైంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
'ఇన్నేళ్లుగా విజయ్(విజయ్ దేవరకొండ) ఎక్కడ పెరిగారు? ఎక్కడ చదువుకున్నారు? ఆయన పాఠశాల రోజులు ఎలా ఉండేవి? అనే విషయాలని ఎన్నో కథల రూపంలో విన్నాను. విజయ్ స్నేహితులందరూ పుట్టపర్తిలో చదువుకున్నారు. అందుకే వాళ్లని ఎప్పుడూ ‘పర్తి బాయ్స్’, ‘పర్తి గర్ల్స్’ అని పిలిచేదాన్ని. వాళ్లంతా నాకూ స్నేహితులు అయిపోయారు. ఇన్నాళ్లు పుట్టపర్తి గురించి ఎన్నో విషయాలు విన్నప్పటికీ, అక్కడికి వెళ్లలేకపోయానని అనిపించేది'
'చివరకు పుట్టపర్తిని సందర్శించే అందమైన అవకాశం లభించింది. విజయ్‌తో పాటు ఆయన స్నేహితులు చదువుకున్న పాఠశాలని, తరగతి గదులని, వసతి గృహాలని చూసే అవకాశం కలిగింది. అక్కడ ఎంతోమంది మంచి వ్యక్తులను కలవడంతో పాటు, హెచ్ఎం ఆంటీని కూడా కలిశాను. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు నాకు కలిగిన ప్రశాంతత మాటల్లో వివరించలేను. అక్కడి వాతావరణం నా మనసుకు ఎంతో ప్రశాంతత ఇచ్చింది'
(ఇదీ చదవండి: కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. పదేళ్ల క్రితమే 'ఆమె' చెప్పింది)
'విజయ్, ఆనంద్‌తో పాటు పుట్టపర్తి విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో ప్రేమ, దయ, మానవత్వం వంటి విలువలు ఇంత బలంగా ఉండటానికి కారణమేంటని నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని. వారు చదువుకున్న పాఠశాలకు వెళ్లిన తర్వాత ఆ విలువలు ఎక్కడి నుంచి వచ్చాయో కొంతవరకు అర్థమైంది. చిన్నతనంలో మనం పెరిగే వాతావరణం, మనతో కలిసి సమయం గడిపే వ్యక్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నారులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేదాలు, భజనలు పాడటం, శ్లోకాలను నేర్చుకుని మనస్ఫూర్తిగా పఠించడం నన్ను ఎంతగానో కదిలించింది'
'నా జీవితంలోని ఈ సమయంలోనే పుట్టపర్తిని సందర్శించాలని స్వామి కోరుకున్నారేమో. అందుకే ఈ ప్రయాణానికి ఇదే సరైన సమయం. కొన్ని ప్రదేశాలు మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. మనకు ఇష్టమైన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారో, వారు పెరిగిన వాతావరణం ఏమిటో తెలుసుకున్నప్పుడు వారిని మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం' అని రష్మిక తన అనుభూతిని పంచుకుంది.
(ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి.. ఏడాది తిప్పించుకున్న విజయ్ దేవరకొండ)
Tags : 1