అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
రణబాలికి నెగెటివ్ టాక్.. అయినా కూడా తగ్గేదేలే..!
Published on Sun, 10/18/2026 - 14:50
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన లేటేస్ మూవీ రణబాలి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. విజయ్, రష్మిక యాక్టింగ్, స్టోరీ బాగున్నప్పటికీ.. నిడివి, స్లోనెరేషన్ కొంత ఇబ్బందికరంగా మారాయని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం రూ. 16.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అయితే టాక్ ఎలా ఉన్నప్పటికీ రణబాలికి ఆదరణ కనిపిస్తోంది. ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా బుకింగ్స్ అవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే రణబాలి నెమ్మదిగా పుంజుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాకు బుక్మైషోలోనే మొత్తం 750కె టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో మొదటి వారంలోనే ఈ సంఖ్య 1 మిలియన్ దాటుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ రోల్ పోషించారు. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, లాల్, వినోద్ సాగర్, మధు నందన్, కిషోర్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు.
Tags : 1