Breaking News

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్

Published on Sat, 10/17/2026 - 20:59

టాలీవుడ్‌లోకి ప్రతి ఏడాది కొత్త కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అయితే వీళ్లలో సక్సెస్ అందుకుని నిలబడే వాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. కొందరు మాత్రం కొన్నాళ్ల పాటు మెరిసి మాయమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఈ బ్యూటీ ఒకరు. అప్పటితో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: తొలి రోజే కలెక్షన్ల సునామీ.. జైలర్ 2కు ఎన్ని కోట్లంటే?)

అవును మీరు ఊహించింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు సింధు తులానీ. ఈమె గతంలో హీరోయిన్‌గా చాలానే సినిమాలు చేసింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. 2003లో ఐతే మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. శింబుతో చేసిన మన్మధ.. ఈమె కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ ఈ చిత్రం సంచలనం సృష్టించింది. తెలుగులో ఈమె హీరోయిన్‌గా చేసిన అతనొక్కడే మరో భారీ విజయాన్ని అందించింది. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూ మరోవైపు ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన సింధు తులానీ.. బతుకమ్మ లాంటి చిత్రాల్లో డీ గ్లామర్ రోల్స్ కూడా చేసింది. స్టార్ హీరోయిన్‌గా వెలిగిన తర్వాత సహాయ పాత్రల్లోనూ కనిపించింది. అలా ప్రేమ కావాలి, ఇష్క్, సన్ ఆఫ్ సత్యమూర్తి తదితర చిత్రాల్లో కనిపించింది. 2017లో 'చిత్రాంగద' తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. గతేడాది రిలీజైన 'ఆంధ్రా కింగ్ తాలూకా'లో ఉపేంద్ర భార్యగా కనిపించింది. ప్రస్తుతం ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భర్త చేతన్ కుమార్‌తో కలిసి కుటుంబ జీవితం గడుపుతోంది. తాజాగా ఈమె పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుని కొత్త కారు కొనుగోలు చేసిన ఫొటోని పోస్ట్ చేసింది. ఇందులో గుర్తుపట్టలేనంతగా మారిపోయేసరికి టాలీవుడ్ ప్రేక్షకులు ఆలోచనలో పడిపోయారు.

(ఇదీ చదవండి: 'జైలర్ 2' సినిమాలో షో స్టీలర్.. ఎవరీ మూర్తి?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)