నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
హీరోగా ‘జబర్దస్త్’ఇమ్మాన్యుయేల్ ..ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్
Published on Sat, 10/17/2026 - 17:48
నటుడు, ‘జబర్దస్త్’ఫేం ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ‘డెస్టినీ’ (విధి). కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో చెందు ముద్దు దర్శకత్వంలో దినేష్ కుర్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకురాలు నందినీ రెడ్డి రిలీజ్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటించనున్నారు.‘‘ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది.
Tags : 1