Breaking News

‘గరివిడి లక్ష్మి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Sat, 10/17/2026 - 09:14

ఆనంది, రాగ్‌ మయూర్‌ జంటగా, వీకే నరేష్‌, రాశి, శరణ్య, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `గరివిడి లక్ష్మి`. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. దీనికి చరణ్ అర్జున్‌ సంగీతం అందించారు. బయోపిక్‌ తరహాలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా నేడు శనివారం (అక్టోబర్‌ 17)న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? రివ్యూ లో చూద్దాం.

90వ దశకంలో జానపద గీతాలు అనగానే గుర్తొచ్చే పేర్లలో కళాకారిణి గరివిడి విజయలక్ష్మి ఒకరు. నేటి జెన్‌జీ తరానికి ఆమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్‌ కిడ్స్‌కు మాత్రం ఆమె పాటలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎప్పుడో ఒక సందర్భంలో ఆమె గొంతు వినే ఉంటారు. అలాంటి ప్రముఖ జానపద కళాకారిణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘గరివిడి లక్ష్మి’. బుర్రకథ, జానపద కళలపై పెద్దగా అవగాహన లేని నేటి తరానికి ఆమె జీవితాన్ని పరిచయం చేసే ప్రయత్నం ఇది. 

కథేంటంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నాటి విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతంలో పుట్టిన కళాకారిణి జీవిత కథే ఈ చిత్రం. దేవుడమ్మ (రాశి), తాత నాయుడులకు పుట్టిన గారాలపట్టి విజయలక్ష్మి (ఆనంది). చదువు పెద్దగా అబ్బకపోయినా.. ఒక్కసారి వింటే చాలు, ఆ విషయాన్ని ఇట్టే పట్టేసే ప్రతిభ ఆమె సొంతం. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్న లక్ష్మి జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. పలు కారణాలతో భర్తకు దూరమైన దేవుడమ్మ ఆమెకు అన్నీ  తానే అయి పెంచుతుంది.
అయితే లక్ష్మికి 12 ఏళ్ల వయసులోనే పెళ్లి చేయాల్సి వస్తుంది. ఆ పెళ్లి ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? లక్ష్మి జానపద కళల వైపు అడుగులు వేయడానికి కారణమేంటి? బుర్రకథ నేర్చుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురయ్యాయి? గరివిడి లక్ష్మిగా ఆమె ఎలా గుర్తింపు తెచ్చుకుంది? అనేది తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.

(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ఎలా ఉందంటే?
90స్ లో జానపద కళతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గరివిడి విజయలక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము సాహసమనే చెప్పాలి. ప్రస్తుతం కొత్త తరహా సంగీత ప్రపంచంలో కనుమరుగవుతున్న బుర్రకథ, జానపద కళల నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించడం ఆసక్తికరమైన ప్రయత్నం అనే చెప్పాలి .

ఒక కళాకారిణి జీవితాన్ని మాత్రమే కాకుండా.. ఆమె ఎదుగుదల వెనుక ఉన్న కష్టాలు, కన్నీళ్లు, వ్యక్తిగత సంఘర్షణలను చూపించాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు ‘మహానటి’ సినిమా గుర్తుకు వస్తుంది. అయితే ఇక్కడ కథానాయిక ప్రయాణం, జానపద కళ చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

సినిమా తొలి భాగంలో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం కేటాయించారు. లక్ష్మి బాల్యం, కుటుంబ పరిస్థితులు, ఆమె జీవితంలో చోటుచేసుకునే పరిణామాలను చూపిస్తూ కథ ముందుకు సాగుతుంది. దీంతో అక్కడక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ గరివిడి లక్ష్మి జీవిత ప్రయాణం సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. మధ్యమధ్యలో వినిపించే జానపద గేయాలు 90స్‌ ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. ఆ పాటల్లోని సహజత్వం, అప్పటి కళా వాతావరణం సినిమాకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. కొంత ఓపికతో చూస్తే తొలి భాగం ముగిసే సమయానికి కథపై ఆసక్తి పెరుగుతుంది.

ద్వితీయార్ధం  ఊరటనిస్తుంది
ఏదో మిస్‌ అయిందనే భావనతో విరామం తీసుకున్న ప్రేక్షకులకు ద్వితీయార్ధం కొంత ఊరటనిస్తుంది. లక్ష్మి జీవితంలో ప్రేమ చిగురించడం, ఆ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు కథకు భావోద్వేగాన్ని జోడిస్తాయి. ప్రేమ కోసం ఆమె పడే తపన, కన్నీళ్లు కొన్ని సన్నివేశాల్లో ఆలోచింపజేస్తాయి.
అయితే ఒక దశలో కథనం కాస్త పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, లక్ష్మి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసే పరిణామాలు కథపై ప్రేక్షకుడికి అనుబంధాన్ని పెంచుతాయి. ఆమె పడే బాధను చూస్తుంటే ఆ పాత్రతో మనమూ ప్రయాణిస్తున్న భావన కలుగుతుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు సినిమా ముగిసే వరకు ఆసక్తిని కొనసాగిస్తాయి. ముఖ్యంగా చివరి ఘట్టాలు లక్ష్మి జీవితంలోని సంఘర్షణలను మరింత బలంగా చూపిస్తాయి.
అయితే కొన్ని సన్నివేశాల్లో కథనం నెమ్మదించడం, కొన్ని భావోద్వేగాలను మరింత ప్రభావవంతంగా చూపించే అవకాశం ఉన్నా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోకపోవడం లోపాలుగా అనిపిస్తాయి. అయినప్పటికీ జానపద కళను కథలో భాగం చేసిన తీరు, ఓ కళాకారిణి జీవితంలోని మరో కోణాన్ని పరిచయం చేయాలనే ప్రయత్నం సినిమాకు బలాన్నిస్తాయి.
ఎవరెలా చేశారంటే?
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది అద్భుతంగా నటించింది. భావోద్వేగ సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించేలా నటించడంతో పాటు.. అమాయకత్వం, పట్టుదల, కళపై ప్రేమను తన హావభావాలతో చక్కగా పలికించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనే సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. పాత్రలోకి పూర్తిగా ఒదిగిపోయి, లక్ష్మి జీవితాన్ని ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నంలో విజయవంతమైంది.

రాంబాబు పాత్రలో నరేశ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యానికి న్యాయం చేశాడు. సీనియర్‌ నటి రాశి దేవుడమ్మగా మరోసారి తన అనుభవాన్ని చూపించింది. తల్లి పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలికించింది. సకలక శంకర్‌, శ్రీరామ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి . ముఖ్యంగా జానపద గేయాలు కథకు తగ్గట్టుగా అందించాడు . నిర్మాణ విలువలు పరవాలేదు. దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరపై చూపించిన విధానం ప్రశంసించదగ్గవే.

చివరిగా..
అక్కడక్కడా నెమ్మదించే కథనం కొంత ఇబ్బంది పెట్టినా.. గరివిడి లక్ష్మి జీవితం, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, జానపద కళకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తుచేసే ప్రయత్నం ఈ సినిమా. 90స్‌ ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసే చిత్రంగా నిలుస్తుంది. జానపద కళలపై ఆసక్తి ఉన్నవారితో పాటు, ఓ కళాకారిణి జీవితంలో దాగున్న సంఘర్షణలను తెలుసుకోవాలనుకునేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

రేటింగ్‌: 2.75/5

-ప్రశాంత్‌ కందా

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి