తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
గాల్లో ఎగిరిన Tesla కారు.. మస్క్ మరో ప్రయోగం!
Published on Fri, 10/16/2026 - 09:32
కార్లు రోడ్ల తిరగడమే కాదు.. భవిష్యత్తులో గాల్లో కూడా ప్రయాణిస్తాయనే ఆలోచన చాలాకాలంగా ఉంది. ఇప్పుడు ఈ ఆలోచనను నిజం చేసే దిశగా టెస్లా మరో అడుగు ముందుకేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ కొత్త రోడ్‌స్టర్ కారుతో చేసిన విన్యాసాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించడంతో పాటు, కొద్దిసేపు గాల్లోకి ఎగిరి సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికాలోని మెక్‌గ్రెగర్‌లో ఉన్న స్పేస్ఎక్స్ కేంద్రంలో అక్టోబర్ 15న ఈ ప్రదర్శన జరిగింది. ఇందులో భాగంగా టెస్లా రోడ్‌స్టర్ భారీ వంపుతో ఉన్న ర్యాంప్‌పైకి వెళ్లి, దానిపై తలకిందులుగా ప్రయాణించింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి తిరిగి సురక్షితంగా భూమి మీదకు దిగింది.
ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ష్యత్తులో నిజంగానే ఎగిరే కార్లు ఉంటాయని తేలింది'' అని అన్నారు. టెస్లా అధికారిక ఖాతా కూడా ఈ వీడియోను పంచుకుంది.
Turns out the future does have flying cars https://t.co/6fexPp6SXI
— Elon Musk (@elonmusk) October 16, 2026
కారులో రాకెట్ టెక్నాలజీ!
ఈ కొత్త రోడ్‌స్టర్‌లో స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన కోల్డ్ గ్యాస్ థ్రస్టర్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒత్తిడితో నిల్వ చేసిన వాయువును విడుదల చేయడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ సాంకేతికతకు రాకెట్లలో ఉపయోగించే థ్రస్ట్ సూత్రంతో సంబంధం ఉంది. ఇతర ప్రత్యేక వ్యవస్థలతో కలిపి దీన్ని ఉపయోగించడం వల్ల కారు అసాధారణ విన్యాసాలు చేయగలిగింది.
అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కారు గాల్లోకి ఎగిరిందని చెప్పి అది విమానంలా ఎక్కడికైనా ప్రయాణించగలదని భావించకూడదు. ఈ ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో జరిగింది. సాధారణ రోడ్లపై ఇలాంటి కార్లను నడపడానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు, సాంకేతిక పరీక్షలు ఇంకా కీలకమైన అంశాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: అమెరికా గ్రీన్ కార్డుల వివాదం.. బ్రాడ్ స్మిత్ హెచ్చరిక!
Tags : 1