Breaking News

జియో అలా పుట్టింది : ఇషా అంబానీ చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Published on Thu, 10/15/2026 - 17:27

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్‌ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకి సిద్ధమవుతున్నవేళ జియో (Jio) పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని రిలయన్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ (Isha Ambani) పంచుకున్నారు. జియో ప్రారంభం వెనుక కథ ఇపుడు నెట్టింట విశేషంగ ఆనిలుస్తోంది.

జియో ప్లాట్‌ఫామ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) దాఖలు చేసిన తర్వాత విలేకరుల సమావేశంలో ఇషా అంబానీ  జియో కంపెనీ ఆవిర్భావానికి తన సోదరుడు ఆకాష్ అంబానీతో పంచుకున్న ఒక అనుభవమే కారణమని పేర్కొన్నారు. 

అమెరికాలో చదువుకుంటున్న ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు సెలవులకు ముంబైలోని తమ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఘటన జరిగింది. ఈషా తన కాలేజీ అసైన్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయాల్సి ఉండగా, ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోవడంతో సబ్‌మిట్ చేయలేకపోయారు. దీంతో దేశంలో డేటాసేవలు, ఇంటర్నెట్‌  వేగం మీద   ఆలోచన మొదలైంది. అమెరికాలో ఉన్న మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ భారత్‌లో ఎందుకు లేదు? అనే విషయమై  ఇషా అంబానీ, ఆకాశ్‌ అంబానీ మధ్య చర్చ జరిగింది. ఆ  చర్చోపచర్చలే జియో ఆవిర్భావానికి నాంది పలికాయి.

భారత్‌లోని ఇంటర్నెట్ డిమాండ్‌ను తీర్చడానికి ఒక డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించాలని ఆకాశ్ అంబానీ భావించారు. ఈ ఆలోచనే 2016 సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో వాణిజ్య పరంగా ప్రారంభం కావడానికి మార్గం సుగమం చేసింది. ప్రారంభంలోనే జియో అన్‌లిమిడెట్‌ వాయిస్ ,డేటా సేవలతో మార్కెట్లోకి ప్రవేశించి, భారతదేశంలో  మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో విప్లవం సృష్టించింది. దాదాపు ఒక దశాబ్దం తరువాత, రిలయన్స్ జియో  పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓతో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: చికాగోలో సామూహిక అత్యాచారం కలకలం : ‘నా టర్న్’ఎపుడు‌ అంటూ రచ్చ?!

జియో ఐపీవో (IPO) విశేషాలు
జియో ప్లాట్‌ఫామ్స్ తన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ను ఇప్పటికే దాఖలు చేసింది.  ఈ ఐపీఓ అక్టోబర్‌ 21న ప్రారంభమై, అక్టోబర్‌ 23న ముగియనుంది.  ఈ సందర్భంగా  జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ  భారతదేశాన్ని డేటా సమృద్ధిగా లభించే దేశంగా మార్చడమే జియో లక్ష్యమని  పేర్కొన్నారు.  జియో అత్యంత వేగవంతమైన 4G నుండి 5Gకి పరివర్తనను సాధించిందని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. సరఫరా పరిమితుల కారణంగానే దేశంలో గతంలో డేటా కొరత ఉండేదని,  14వ ఆపరేటర్‌గా 2016లో తాము మార్కెట్లోకి ప్రవేశించే నాటికి వన్‌ జీబీ డేటా సుమారు రూ. 228 ధర ఉండేదని, డౌన్‌లోడ్ వేగం 2.5 Mbps ఉండేదని గుర్తు చేశారు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులు అప్పులు తగ్గించడానికే ఉపయోగ పడతాయనీ, జియో అప్పులు లేని సంస్థగా మారే దిశగా పయనిస్తోందన్నారు.

ఇదీ చదవండి: జర్మనీలో అగ్నిప్రమాదం : ముగ్గురు భారతీయులు సజీవ దహనం

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)