Breaking News

క్లాడ్‌ఏఐలో అమెరికా ఓటింగ్‌ సమాచారం

Published on Thu, 10/15/2026 - 12:30

నవంబర్‌లో రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తన ‘క్లాడ్’ ఏఐ చాట్‌బోట్‌లో కీలక అప్‌డేట్ ప్రకటించింది. వినియోగదారులకు మరింత విశ్వసనీయమైన, అధికారిక సమాచారాన్ని అందించే లక్ష్యంతో నాన్‌ఫ్రాఫిట్ సంస్థ ‘డెమోక్రసీ వర్క్స్’ సేకరించిన అధికారిక ఓటింగ్ డేటాను క్లాడ్‌లో అనుసంధానించనున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం అమెరికాలో రాజకీయాలు, ప్రజా విధానాలు, సామాజిక అంశాలకు సంబంధించిన సంభాషణలు క్లాడ్ వినియోగంలో దాదాపు 5.75% వరకు ఉంటున్నాయని ఆంత్రోపిక్ తన తాజా అధ్యయనంలో స్పష్టం చేసింది. ఇందులో ఎన్నికలకు సంబంధించిన క్వెరీలు సుమారు 0.51% ఉండగా ఎవరికి ఓటు వేయాలనే సిఫార్సులను కోరే వారు కేవలం 0.01% మాత్రమే ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం ప్రబలకుండా ఉండేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది.

ప్రత్యేకతలు ఇవే..

  • ఇకపై అమెరికాలో వినియోగదారులు ఎక్కడ ఓటు వేయాలి, పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి వంటి ప్రశ్నలు అడిగినప్పుడు క్లాడ్ నేరుగా 'డెమోక్రసీ వర్క్స్' డేటా బేస్ ఆధారంగా రాష్ట్రాలవారీగా కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

  • పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు రోజున, తదనంతరం వచ్చే రోజుల్లో తాజా అధికారిక ఓట్ల లెక్కింపు సరళిని, ఫలితాలను చాట్‌బోట్ ద్వారానే వినియోగదారులకు ప్రత్యక్షంగా చూపించనున్నారు.

  • నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లు సృష్టించడం, తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఏఐని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడానికి ఆంత్రోపిక్ కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించే అకౌంట్లను తక్షణమే తొలగిస్తామని హెచ్చరించింది.

ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)