Breaking News

OpenAI కీలక విభాగానికి భారతీయుడే బాస్!

Published on Thu, 10/15/2026 - 11:32

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీలో ముందుండేందుకు ఓపెన్ఏఐ ఎప్పటికప్పుడు.. తన సాంకేతిక సామర్థ్యాలను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. సంస్థలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాన్ని పర్యవేక్షించిన సచిన్ కట్టి స్థానంలో ఉదయ్ రుద్దరాజుకు బాధ్యతలు అప్పగించింది.

ఉదయ్ రుద్దరాజు గత ఏడాది ఓపెన్ ఏఐలో చేరారు. జూలైలో కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సంస్థలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటింగ్ విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. కాగా.. సచిన్ కట్టి రాబోయే కొన్ని వారాల్లో తన ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పుకుని, కంపెనీలో సలహాదారుగా కొనసాగనున్నారు. సంస్థలో పనిచేసిన సమయంలో కట్టి పలు భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులను పర్యవేక్షించారు.

ఓపెన్ఏఐ డేటా సెంటర్లపై ఎక్కువ దృష్టిపెడుతోంది. దీనికి కారణం చాట్‌జీపీటీ వంటి ఏఐ వ్యవస్థలు పనిచేయాలంటే భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. ఇందుకోసం అధిక సామర్థ్యం కలిగిన చిప్‌లు, సర్వర్లు, నిరంతర విద్యుత్ సరఫరా, శీతలీకరణ వ్యవస్థలు అవసరమవుతాయి. వీటన్నింటినీ ఏర్పాటు చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

ఓపెన్ఏఐ అధినేత శామ్ ఆల్ట్‌మన్ కూడా భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాల కోసం ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఖర్చు చేయాల్సి రావచ్చని గతంలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రూ.6.99 లక్షలకే.. 2026 టయోటా గ్లాంజా!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)