Breaking News

నవరాత్రి దీక్ష..! ఏకంగా 2,516 పదునైన మేకులపై పడక

Published on Wed, 10/14/2026 - 14:26

దేవి నవరాత్రులు మొదలై..అప్పుడే నాలుగో రోజుకి చేరుకున్నాయి. దేశమంతట దసరా వేడుకలతో శోభాయమానంగా ఉంది. అ‍మ్మలుగన్న అమ్మ ఆ దుర్గమ్మను భక్తులంతా వివిధ రీతుల్లో కొలుచుకుంటూ భక్తిపారవశ్యంతో మునిగితేలుతున్నారు. ఎటుచూసినా భవాని దీక్షలు, నవరాత్రి ఉత్సవాలు. ఈ తరుణంలో ఓ మహిళ వినూత్న రీతీలో తన భక్తిని ప్రదర్శించింది. ఆమె అసాధారణ నవరాత్రి దీక్ష చూస్తే షాకవ్వాల్సిందే. దీన్ని చూసేందుకు జనాలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత భక్తి విన్యాసం ఎక్కడ చోటు చేసుకుందంటే

ఈ అద్భుత ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల మధుమాల దేవి అనే మహిళ నవరాత్రి సందర్భంగా చేస్తున్న భక్తి ప్రక్రియ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది. దుర్గాదేవి ఆరాధనలో భాగంగా మధుమాల ఏకంగా  2,516 పదునైన మేకులు అమర్చిన పడకపై పడుకుని నవరాత్రి దీక్ష చేస్తోంది. తన ఇంట్లోనే ఈ దీక్ష చేస్తోంది. ఆమె ఛాతీపై పవిత్రమైన కలశం ఉంచగా, పక్కనే త్రిశూలం కూడా ఉంది. ఆమె నవరాత్రి తొలి రోజు నుంచి ఆహారం, నీరు తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తోంది. ఆమె దీక్షను వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. 

ఈ దీక్ష కోసమే ప్రత్యేకంగా మేకులతో చేసిన చెక్క పడకను తయారు చేశారట. ప్రతి మేకు ఐదు అంగుళలా పొడవుతో మొత్తం 32 కిలోలు ఉంటుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ మేకులపై పలుచని వస్త్రం పరిచి..దానిపై మధుమాల దేవి పడుకుంటుందట. ఈ దీక్ష సమయంలో దానిపైనే ఆమె శయనమట. ఈ విభిన్నమైన దుర్గా ఆరాధన అక్కడ చర్చనీయాంశమై ప్రజలలో ఆసక్తిని రేకెత్తించి ఆమె ఇంటికి క్యూ కట్టేలా చేసింది. 

ఇదిలా ఉండగా ఆమె భర్త   రంజిత్ చౌరాసియా తన భార్య మధుమాల దేవికి అమ్మవారంటే మహా ఇష్టమని, ఆ తల్లిపై అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని అన్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు అమ్మవారికి సంబంధించిన కల వచ్చిందని అప్పటి నుంచి మరింత నమ్మకం ఏర్పడి ఇలా అమ్మవారిని ఆరాధిస్తోందని చెప్పారు. గతేడాది కూడా నవరాత్రి సమయంలో కలశం ఏర్పరిచి..తొమ్మిదిరోజుల పాటు పూజలు చేసినట్లు తెలిపారు.  

అలాగే తాము పూజించే దుర్గాదేవి విగ్రహం తమ ఇంటిలోపల భూమిలోనే దొరికిందని, దానికోసం ప్రత్యేకంగా ఆలయం ఏర్పాటు చేసి కొలుచుకుంటున్నట్లు తెలిపారు. ఇక తన భార్యకు మద్దతుగా తాను కూడా ఉపవాసం ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి: నవరాత్రులు మాదిరిగా..అక్కడ తొమ్మిది రోజుల శాకాహార వేడుక..!

Videos

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బుద్ధిలేని గేమ్.. హౌస్ లో మరో బిగ్ ట్విస్ట్

ఏపీ లోకల్ ఫెట్ మూడు దశల్లో మున్సిపల్ ఎన్నికలు

Photos

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)

+5

రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. విరోష్ జంట క్యూట్‌ మూమెంట్స్ (ఫోటోలు)

+5

'ఆలియాస్ రుక్మిణీ'గా ఆఫియా సయ్యద్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)

+5

‘గరివిడి లక్ష్మి’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)