జస్ట్‌ రూ.2 వేలుతో ప్రారంభించి..రూ. 580 కోట్ల బ్రాండ్‌..!

Published on Wed, 10/14/2026 - 13:40

ఒక ఇంటిలోని వంటగదిలో జస్ట్‌ రూ. 2 వేలుతో ప్రారంభమై ఏకంగా కోట్ల విలువ చేసే బ్రాండ్‌ రేంజ్‌కు చేరుకుంది. స్నాక్స్, స్వీట్స్‌ తయారు చేస్తూ..ఫిల్టర్‌ కాఫీ రుచుల వరకు వివిధ రకాల తినుబండరాలను అందిస్తూ నెంబర్‌ వన్‌ బ్రాండ్‌గా పేరు తెచుకుంది. కస్టమర్‌ అభిరుచి ఆధారంగానే వంటకాలు అందించి సక్సెస్ అయిన ఫుడ్‌ బిజినెస్‌.

అదే స్వీట్‌ కరం కాఫీ అనే విలువైన స్నాక్‌ బ్రాండ్‌. దీన్ని చెన్నైకి చెందని నళిని పార్థిబన్‌, ఆమె భర్త ఆనంద్‌ భరద్వాజ్‌, కజిన్స్‌ వీర రాఘవన్‌, శ్రీవత్సవ్‌ సుందరరామన్‌ స్థాపించారు. జస్ట్‌ తమ ఇంటి గదిలో రూ. 2000తో ప్రారంభమైన వ్యాపారం ఇది. అమ్మమ్మ అందించే రుచికరమైన స్నాక్స్‌ జ్ఞాపకాలతో మొదలైన వ్యాపారం అని తెలిపారు. చిన్నప్పుడు తన అమ్మమ్మ శ్రద్దగా తయారు చేసే మైసూర్‌పాక్‌, జాంగ్రీలు వంటి వంటకాల రుచి ఇప్పుడు దొరకడం లేదని భావించి..ఆమె జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఈ వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు నళిని. 

జస్ట్‌ కరపత్రాలతో మొదలుపెట్టిన వ్యాపారం ఎందరినో ప్రభావితం చేసి చాలామంది మహిళలకు దారి చూపిందన్నారు. తమ వ్యాపారంతోనే చాలామంది మహిళలు క్లౌడ్‌ కిచెన్‌ వంటి వ్యాపారాలు చేసేందుకు ముందుకొచ్చారని చెప్పుకొచ్చారు. కాగా, తాము మురుకులు, మిక్చర్‌, బనానా చిప్ప్‌, మైసూర్‌ పాక్‌, లడ్డూలు, దక్షిణ భారత ఫిల్టర్‌ కాఫీ వంటి వాటిని ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు ఉపయోగించకుండా తయారు చేస్తామని చెప్పారు. అదే కస్టమర్ల మనసుని గెలుచుకునేందుకు దారితీసిందన్నారు.

ఒక్కసారి తమ వద్ద ఉత్పత్తులు కొన్నవారు మరోసారి వచ్చి కొనితీరుతారని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే తమ ఉత్పత్తులు తాజాగా ఉండేలా ప్యాకింగ్‌ చాలా కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. తమ కంపెనీ ప్రత్యేక ప్యాకింగ్‌ని వినియోగిస్తుందని చెప్పారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన విధంగా ఇంట్లో తయారు చేసే రుచితో కూడిన పిండివంటలు అందిస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశపు పిండివంటల రుచిని ఎక్కువ మందికి పరిచయం చేయాలని ప్రారంభించి..ఇవాళ ఈ స్థాయిలో లాభాలు గడిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

అలాగే తమ ఉత్పత్తులను భారతదేశం అంతటా విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఈ కామర్స్‌తో సహా అన్ని చోట్ల తమ ఉత్పత్తులు విక్రయిస్తామని అన్నారు. ఇక అంతర్జాతీయ వినియోగదారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ కూడా మెయింటైన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో మార్కెట్‌ప్లేస్‌లో 55% ఆదాయం, ఆఫ్‌లైన్‌ అమ్మకాల్లో దాదాపు 10% వాటాతో ఏడాదికి ఏకంగా రూ. 580 కోట్లు ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ఉన్నది ఒక్కటే లైఫ్‌..ప్లీజ్‌ క్లిష్టంగా మార్చుకోకండి..! టెక్‌ గురు మోహనదాస్‌ జీవన సూత్రాలివే

 

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)