ఆర్థిక, టెక్నాలజీ పవర్‌గా భారత్‌!

Published on Wed, 10/14/2026 - 04:11

న్యూఢిల్లీ: భారత ఎకానమీ వృద్ధి జోరుకు బలమైన ఆర్థిక మూలాలు, సవాళ్లకు తట్టుకుని నిలబడే శక్తి, నిరంతర సంస్కరణలే దన్నుగా నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక, టెక్నాలజీ పవర్‌గా నిలుస్తున్న భారత్‌.. ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసేలా కాకుండా, ప్రగతి పథంలో వాటికి తోడ్పాటునందిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ‘మేము ఇతరుల ఎదుగుదలను అడ్డు కోము, ప్రపంచంతో పాటు, ప్రపంచం కోసమే వృద్ధి బాటలో పయనిస్తాం’ అని మంగళవారమిక్కడ జరిగిన బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ సదస్సు–2026లో వ్యాఖ్యానించారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరాపరమైన అడ్డంకులు, వ్యూహాత్మక వనరుల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో భారత్‌కున్న ఆర్థిక, టెక్నాలజీ సామర్థ్యాలు ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు దోహదం చేస్తాయన్నారు. 

పెద్ద ఎకానమీల వృద్ధిలో భారత్‌ టాప్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. 700 బిలియన్‌ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు, పన్నులు, కార్మిక, దివాలా తదితర చట్టాలకు సంబంధించిన సంస్కరణలు దేశంలో స్థిరత్వానికి నిదర్శమన్నారు. ‘అనిశ్చితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచంలో విశ్వసనీయత, స్థిరత్వానికి భారత్‌ భరోసా కల్పిస్తోంది’ అని మోదీ స్పష్టం చేశారు.

పెద్ద ఎకానమీల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలుస్తోందని.. బలమైన ఆర్థిక మూలాల వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ‘పవర్‌ టు ఎంపవర్‌’ అనే నినాదంతో భారత్‌ అభివృద్ధి చెందుతోందని.. నిజమైన ఆర్థిక, సాంకేతిక బలం అనేది ఇతరులను నియంత్రించడంలో కాకుండా, వారికి అవకాశాలను కల్పించడంలోనే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.  2014 ముందు వందల సంఖ్యలో మాత్రమే ఉన్న స్టార్టప్‌ వెంచర్లు.. నేడు 2,50,000 పైకి చేరాయని.. ఇందులో సగానికిపైగా చిన్న నగరాలు, పట్టణాల నుంచే పుట్టుకొచ్చాయని కూడా వెల్లడించారు. గడిచిన దశాబ్దకాలంలో భారత్‌ 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందన్నారు. 

తయారీలోనూ సత్తా... 
నేడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి ఐదు జనరిక్‌ ఔషధాల్లో ఒకటి భారత్‌లోనే తయారవుతోందని.. కోవిడ్‌ సమయంలో 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసిన సంగతిని కూడా ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ అవసరాలకు దేశీ తయారీ రంగ సామర్థ్యాన్ని ఇది చాటి చెప్పిందన్నారు. అంతేకాకుండా, 2,000కు పైగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)తో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు దేశం సేవలందిస్తోందని చెప్పారు.

ఎస్‌టీటీ, ఎల్‌టీసీజీపై చర్చ మంచిదే: సీతారామన్‌
స్టాక్‌ మార్కెట్లో సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ), దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను (ఎల్‌టీసీజీ) తగ్గించాలంటూ కొంతకాలంగా నడుస్తున్న చర్చపై బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ సదస్సు వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ‘ఎస్‌టీటీ, ఎల్‌టీసీజీ పన్నుల హేతుబద్ధీకరణమై జరుగుతున్న చర్చ మంచిదే. నేను కూడా ఇటువంటి చర్చలను చాలా ఆసక్తిగా వింటాను. మన తదుపరి బడ్జెట్‌ కూడా దగ్గరపడుతోంది. ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఇటువంటి తరుణంలో నేను ఏం చేస్తాను, ఏవి పరిగణనలోకి తీసుకోను అనేవి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. 

అయితే, ఎల్‌టీసీజీపై చాలా మంది నుంచి వస్తున్న  అభిప్రాయాల మాదిరిగానే, స్వదేశంలో, అలాగే విదేశాల్లో కూడా ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై చర్చ జరగడం ఆరోగ్యకరమైన విషయం. నేను కూడా ఆ అభిప్రాయాలన్నింటినీ శ్రద్ధగా వినేందుకు సిద్ధం’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే 2027–28 కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ఇన్వెస్టర్లకు భారీ పన్ను ఊరట కల్పిస్తుందన్న ఊహాగానాలు మరింత జోరందుకుంటున్నాయి. 

మరోపక్క, డాలరుతో రూపాయి మారకం విలువలో తీవ్ర హెచ్చుతగ్గులను నివారించేందుకు ఆర్‌బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందన్నారు. పటిష్టమైన ఫారెక్స్‌ నిల్వలు, ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నప్పటికీ.. రూపాయి విలువ పతనానికి ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితులే కారణమని ఆమె పేర్కొన్నారు. ఆర్‌బీఐ చేపట్టే చర్యలు.. కరెన్సీ ఒడిదుడుకుల నివారణకు మాత్రమేనని, రూపాయి విలువ నిర్ధారణ వాటి లక్ష్యం కాదని సీతారామన్‌ స్పష్టం చేశారు.  

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)