Breaking News

కీళ్లెంచి మేలెంచేలా...!

Published on Sun, 10/11/2026 - 15:22

కీళ్లవాతం (ఆర్థరైటిస్‌) అన్న మాట వినగానే మోకాళ్ల నొప్పులు, నడవడం కష్టంగా ఉన్న వయసు పైబడిన వ్యక్తి చిత్రం మనసులో మెదులుతుంది. అయితే ఆర్థరైటిస్‌ అనేది కేవలం వృద్ధాప్యం వల్ల వచ్చే వ్యాధి కాదు. కీళ్లు, ఎముకలు, కండరాలు, లిగమెంట్ల కణజాలాలను ప్రభావితం చేసే ఈ సమస్య పుట్టబోయే శిశువుల నుంచి పెద్దవయసు వారి వరకు ఎవరికైనా రావచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ సొంత కణాలను పరాయివిగా భావించి దాడి చేయడం సహా అనేక కారణాలతో ఇది వస్తుంది. వెద్యవిజ్ఞానం అభివృద్ధి చెందేకొద్దీ ఈ రుమాటిక్‌ వ్యాధులు కేవలం కీళ్లనే కాకుండా మొత్తం దేహాన్ని ప్రభావితం చేయగలవని తెలిసింది. ఒకప్పుడు నొప్పి నివారణ మందులతో అదుపు చేసేవాటికి ఇప్పుడు అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. రేపు (అక్టోబరు12న) వరల్డ్‌ ఆర్థరైటిస్‌ డే సందర్భంగా ఈ సరికొత్త చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం. 

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ప్రధానంగా కీళ్లకు సంబంధించిన వ్యాధి అయినప్పటికీ గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం వంటి ఇతర అవయవాలనూ ప్రభావితం చేయవచ్చు. సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌లో చర్మంతో పాటు కీళ్లు, వెన్నెముక, పేగులూ ప్రభావితమవుతాయి. స్పాండిలో ఆర్థరైటిస్‌లో వెన్నుముకతో పాటు కళ్లలో వాపు (యువైటిస్‌), పేగువాపు కనిపించవచ్చు. 

లూపస్‌ అనేది కిడ్నీలు, మెదడు, గుండె,  ఊపిరితిత్తులు, చర్మం వంటి అనేక అవయవాలను ప్రభావితం చేయగలదు.  అందువల్ల ఆర్థరైటిస్‌లో వ్యాధి ఏ రకమో తెలుసుకోవడంతో పాటు అది ఏ అవయవాలను ప్రభావితం చేస్తోందో గుర్తించి నిరంతరం పర్యవేక్షించడం కీలకం. అందుకే ఇప్పుడు రుమటాలజిస్టులు కేవలం కీళ్లనొప్పికి చికిత్స చేయకుండా, అవసరాన్ని బట్టి కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పల్మునాలజిస్టులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, డర్మటాలజిస్టులతో కలిసి సంయుక్తంగా చికిత్స అందిస్తున్నారు.

వ్యాధి నియంత్రించే దిశగా...
ఒకప్పుడు ఆర్థరైటిస్‌ చికిత్సలో ప్రధాన లక్ష్యం నొప్పి, వాపును తగ్గించి ఉపశమనం కలిగించడమే. వ్యాధి ముదిరి కీళ్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు శస్త్రచికిత్స కూడా అవసరమయ్యేది. అయితే లక్షణాలు తగ్గినా వ్యాధి లోపల కొనసాగుతూ కీళ్లకు శాశ్వత నష్టం, కదలికల పరిమితి, చివరకు వైకల్యానికి దారితీసే అవకాశం ఉండేది. ప్రస్తుతం చికిత్స లక్ష్యం కేవలం లక్షణాలను తగ్గించడం నుంచి వ్యాధినే నియంత్రించడం వైపునకు మారింది.

వ్యాధి పురోగతిని మార్చే మందుల ఆవిర్భావం...
నొప్పి నివారణ మందుల నుంచి వ్యాధిని అదుపు చేసే డిసీజ్‌ మాడిఫైయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌ (డీఎమ్‌ఆర్‌డీఎస్‌) వరకు వచ్చిన పరిణామం ఆర్థరైటిస్‌ చికిత్సలో కీలకమైన ముందడుగు. ఇవి కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా వ్యాధికి కారణమయ్యే వ్యాధినిరోధక వ్యవస్థలోని అసాధారణతలను నియంత్రించి కీళ్లవాపు, నొప్పిని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో కీళ్లకు జరిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెథోట్రెక్సేట్‌తో పాటు లెఫ్లునోమైడ్, సల్ఫాసాలజైన్‌  వంటి డీఎమ్‌ఆర్‌డీఎస్‌లు అందుబాటులోకి వచ్చాయి.

అలస్యం చేయకుండా చికిత్స ... 
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లో చికిత్స ఆలస్యం అయితే కీళ్లలో శాశ్వత మార్పులు, వైకల్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒకసారి జరిగిన నష్టాన్ని తర్వాత మందులతో పూర్తిగా వెనక్కి తీసుకురావడం చాలా సందర్భాల్లో సాధ్యం కాక΄ోవచ్చు. 

అందుకే ముందస్తు నిర్ధారణ, ముందస్తు చికిత్సకు ్ర΄ాధాన్యం పెరిగింది. చికిత్స లక్ష్యం కీళ్ల శాశ్వత నష్టాన్ని, వైకల్యాన్ని నివారించడం, బాధితులు తమ రోజువారీ పనులను స్వయంగా చేసుకునేలా చూడడం, కుటుంబ, సామాజిక జీవితంపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించడం వైపునకు మారింది. దీనినే ‘ట్రీట్‌ టు టార్గెట్‌’ విధానం అంటారు. ఇదే ఆలోచన బయలాజిక్స్‌ చికిత్సకు దారితీసింది.

చికిత్సలో మరో విప్లవం... 
డీఎమ్‌ఆర్‌డీఎస్‌లతో చికిత్సలో కీలకమైన మార్పు వచ్చినప్పటికీ కొంతమందిలో వ్యాధి పూర్తిగా అదుపులోకి రా(లే)దు. ముఖ్యంగా తీవ్రమైన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, సోరియాటిక్‌ ఆర్థరైటిస్, సిస్టమిక్‌ లూపస్‌ అరిథెమటోసస్‌ (ఎస్‌ఎల్‌ఈ) వంటి వ్యాధుల్లో ఇలా జరగవచ్చు. ఆటోఇమ్యూన్‌ వ్యాధుల్లో సొంత కణజాలంపై దాడికి కారణమయ్యే ప్రత్యేక కణాలు, రసాయన పదార్థాలు, సంకేత మార్గాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. 

దాంతో మొత్తం వ్యాధినిరోధక వ్యవస్థను అణచివేయకుండా, వ్యాధికి కారణమయ్యే నిర్దిష్ట మార్గాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే ‘బయలాజిక్స్‌’ అభివృద్ధి చెందాయి. టీఎన్‌ఎఫ్, ఐఎల్‌–6 వంటి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే మార్గాలను బ్లాక్‌ చేయడం ద్వారా వ్యాధిని నియంత్రించే ఈ చికిత్సలు కీళ్ల నష్టాన్ని తగ్గించడంతో పాటు శారీరక సామర్థ్యాలను కాపాడుకోవడానికీ సహాయపడుతున్నాయి. 

చికిత్సలో మరో ముందడుగు 
బయలాజిక్స్‌ తర్వాత కణాల్లో వాపును కలిగించే నిర్దిష్ట సంకేత మార్గాలను లక్ష్యంగా చేసుకునే టార్గెటెడ్‌ థెరపీలు అందుబాటులోకి రావడంతో ఒకప్పుడు  వైకల్యం తప్పదనిపించిన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, సోరియాటిక్‌ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి ఆటోఇమ్యూన్‌ రుమాటిక్‌ వ్యాధుల్లో వ్యాధిని అదుపులో ఉంచుకుని సాధారణ జీవితం గడపగలిగే అవకాశాలు పెరిగాయి.

ఒక్కో బాధితుడికి ఒక్కోరకమైన చికిత్స
ఆర్థరైటిస్‌ బాధితులందరికీ ఒకే రకమైన చికిత్స సరిపోదు. ఉదాహరణకు సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌లో ఒకరికి చర్మసమస్య తీవ్రంగా ఉంటే, మరొకరిలో వెన్నెముక లేదా కంటి సమస్య ఎక్కువగా ఉండవచ్చు. 

అందుకే ఇప్పుడు వ్యాధి పేరును మాత్రమే కాకుండా దాని తీవ్రత, బాధితుడి ఇతర ఆరోగ్య సమస్యలు, గతంలో ఏ మందులకు ఎలా స్పందించారు, భవిష్యత్తులో ఏ రకమైన ముప్పు ఉండవచ్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్సను నిర్ణయిస్తున్నారు. ఆధునిక రుమటాలజీలో ఇదో కీలక మార్పు.

టార్గెటెడ్‌ చికిత్స నుంచి ‘ఇమ్యూన్‌ రీసెట్‌’ వరకు
వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరును మరింత కచ్చితంగా నియంత్రించే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అందులో‘ఇమ్యూన్‌  రీసెట్‌’ఒకటి.

ఇమ్యూన్‌  రీసెట్‌ అంటే...
కేవలం వ్యాధినిరోధక వ్యవస్థను అణచకుండా, తప్పుదారి పట్టిన కొన్ని రిసె΄్టార్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ‘ఇమ్యూన్‌  రీసెట్‌. సాధారణ చికిత్సలకు స్పందించని కొన్ని తీవ్రమైన ఆర్థరైటిస్‌ రకాలలో కార్ట్‌–టీ, స్టెమ్‌సెల్స్‌ వంటి ఆధునిక సెల్‌ థెరపీలలో బాధితుడి వ్యాధినిరోధక కణాలను బయటకు తీసి, వాటిలో ప్రత్యేక మార్పులు చేసి వ్యాధికి కారణమయ్యే కణాలను లక్ష్యంగా చేసుకునేలా చేసి తిరిగి శరీరంలోకి పంపిస్తారు. 

అయితే ఇవి సాధారణ ఆర్థరైటిస్‌కు ఇచ్చే చికిత్సలు కావు. అధిక ఖర్చు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం, దీర్ఘకాలిక ప్రభావాలు వంటి అంశాల కారణంగా అత్యంత ఎంపిక చేసిన పరిస్థితుల్లో నిపుణుల పర్యవేక్షణలోనే వీటిని ఉపయోగించాలి.

అవగాహనే ఒకరకంగా నివారణ కూడా...
నొప్పిని, వాపును నిర్లక్ష్యం చేయకండి. లక్షణాలను వయసుకు ఆ΄ాదించడం సరికాదు. ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స పొందడం అవసరం. అవగాహన ఉన్నప్పుడు చికిత్సలో ఆలస్యం తగ్గుతుంది. ఫలితంగా వ్యాధి వల్ల కలిగే నష్టాన్ని నివారించే అవకాశం పెరుగుతుంది. ఇందుకు వీలైనంత త్వరగా వ్యాధిని గుర్తించడమన్నది ఎంతగానో అవసరం. 

అలా త్వరగా గుర్తించడంతో పాటు ఈ ఆధునిక ఔషధాలూ, సాంకేతికతల పురోగతితో... ఆర్థరైటిస్‌ వచ్చినప్పటికీ అసలు నొప్పి అన్నదే దాదాపుగా లేనట్టుగా... వ్యాధి లేనప్పటంత సౌకర్యంగా ఉండాలన్న పేషెంట్ల కలా... ఈ ఏడాది థీమ్‌ ‘అచీవ్‌ యువర్‌ డ్రీమ్స్‌’ సాకారమవుతుందన్న ఆశారేఖ కనిపిస్తోంది. 

ఎన్ని ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా వ్యాధిని వీలైనంత ముందుగా గుర్తించడమే కీలకం...
ఆర్థరైటిస్‌ చికిత్సలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం ఇప్పటికీ అతిపెద్ద సవాళ్లలో ఒకటి. కీళ్లలో పదేపదే వాపు రావడం, ఉదయాన్నే గంటకు పైగా బిగుసుకుపోవడం, నొప్పి మళ్లీ మళ్లీ రావడం, విశ్రాంతితో తగ్గక΄ోవడం, కదలికల తర్వాత కొంత ఉపశమనం కలగడం వంటి లక్షణాలను వయసు పెరగడం వల్ల వచ్చిన సాధారణ సమస్యలుగా భావించకూడదు. 

వీలైనంత త్వరగా రుమటాలజిస్టును సంప్రదించాలి. అలాగే కీళ్ల సమస్యలతోపాటు కంటిలో వాపు, చర్మ సమస్యలు, పేగులకు సంబంధించిన లక్షణాలు, చిన్న వయసులోనే పక్షవాతం, గుండెనొప్పి, మహిళల్లో తరచూ గర్భస్రావాలు వంటి లక్షణాలనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆటోఇమ్యూన్‌ రుమాటిక్‌ డిసీజెస్‌లో ‘విండో ఆఫ్‌ ఆపర్చునిటీ’ దశలోనే చికిత్స అందిస్తే వ్యాధి వల్ల కలిగే నష్టాన్ని అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఏఐ లాంటి సాంకేతికతలూ తోడై చికిత్స మరింత సులభమయ్యేందుకు అవకాశం...
కొత్త మందులతోపాటు సాంకేతికత కూడా రుమటాలజీ వైద్యానికి తోడవుతోంది. ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), డిజిటల్‌ హెల్త్, ఆధునిక ఇమేజింగ్‌ ప్రక్రియలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి ఆర్థరైటిస్‌ను ముందుగానే గుర్తించడం, వ్యాధి తీవ్రతను అంచనా వేయడం, చికిత్సకు బాధితులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడం వంటి అనేక అంశాల్లో సహాయపడే అవకాశముంది.
డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి, సీనియర్‌ రుమటాలజిస్ట్‌ 

నిర్వహణ: యాసీన్‌

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)