Breaking News

‘రిపోర్టింగ్‌ లైవ్‌’ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Published on Sun, 10/11/2026 - 12:46

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘రిపోర్టింగ్‌ లైవ్‌’ ఒకటి. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

సమాచారం... ప్రతి ఒక్కరికీ ప్రస్తుత ప్రపంచంలో ఈ సమాచారం అత్యవసరం. ఆ సమాచారాన్ని సేకరించి అందించడానికి ఉన్నవే మీడియా సంస్థలు, ప్రతినిధులు. సరిహద్దుల్లో సైనికుడు శత్రువుతో పోరాటం జరిపేటప్పుడు ఇదమిద్ధమైన కొన్ని లెక్కలుంటాయి. కాని ఓ వార్తను తీసుకురావడానికి వెళ్ళే జర్నలిస్టు తన జీవితాన్నే ఆ పోరాటపు లెక్కలో దింపుతాడు. నిజానికి విలువగల వార్తలను సేకరించి కాపు కాసేవాడు విలేకరి, అలాగే తమ కంటికి కనిపించిన ప్రతి సున్నితమైన సన్నివేశాన్ని అతి కష్టంతో చిత్రీకరించి, ఆ పై ప్రేక్షకులకు తమ వాక్చాతుర్యంతో ఆర్తిగా తెలిపి చూపేవే వార్తలు.

తెరపై కొన్ని నిమిషాల సమాచారాన్ని తెర వెనుక తమ జీవితాలను పణంగా పెట్టి తీసుకువస్తున్న అసలు సిసలైన జర్నలిస్టుల జీవితానుభవాలను చూపించిన సినిమానే ‘రిపోర్టింగ్‌ లైవ్‌’. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కూడా రిపోర్లు అయిపోతారు. అలా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందీ సినిమా. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. 

ఓ ఛానల్‌ లో పని చేసే సంధ్యాయాదవ్‌ తన కెమెరామేన్‌ అయిన వినోద్‌ శర్మతో కలిసి ముంబైలో జరిగిన ఓ బస్సు ప్రమాదాన్ని కవర్‌ చేయడానికి వెళుతుంది. మహారాష్ట్రలో జరిగిన ఈ బస్సు ప్రమాదం ఓ బ్రిడ్జి కూలిపోవడం వల్ల జరుగుతుంది. ఆ బస్సులో చాలా వరకు స్కూల్‌ పిల్లలే ప్రయాణికులు. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సహా, టీచర్లతో పాటు పిల్లలంతా నీళ్ళలో మునిగి చనిపోతారు. ఇది కవర్‌ చేసిన సంధ్య ఆ బ్రిడ్జి నాణ్యతా లోపం వల్లే కూలిందని, అది కూడా అక్కడ జరిగే ఇసుక మాఫియా దందా వల్లనేనని తెలుసుకుంటుంది. 

దాంతో వినోద్‌తో కలిసి ఈ ప్రమాదానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలు సేకరిస్తుంది. మరి... సంధ్య సేకరించిన ఈ వార్తను సదరు సంస్థ ప్రసారం చేసిందా? చేస్తే సంధ్యకు, వినోద్‌కు ఎటువంటి అవరోధాలు ఎదురయ్యాయి? అన్న విషయాలను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘రిపోర్టింగ్‌ లైవ్‌ ’ సినిమాలోనే చూడాలి. బాలీవుడ్‌ రచయితలు ధ్రువ్‌ త్రిపాఠి, మిహిర్‌ జాదవ్‌ సంయుక్తంగా రాసిన కథను ధ్రువ్‌ త్రిపాఠి తెరకెక్కించారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా  ప్రధాన పాత్రలో నటించి, అలరించారు. రోజూ మనం చూసే వార్తల వెనుక ఉన్న కష్టాన్ని ఓ సారైనా చూడాలనుకుంటే ఈ సినిమా సరైన ఛాయిస్‌. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ద వీకెండ్‌.
– హరికృష్ణ ఇంటూరు

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)