Breaking News

విజయ్ దేవరకొండ రణబాలి.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

Published on Sun, 10/11/2026 - 12:26

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన చిత్రం ‘రణబాలి’. గతంలో విజయ్‌తో ‘టాక్సీవాలా’ తెరకెక్కించిన రాహుల్‌ సంకృత్యాన్‌  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక ప్రాంతంలో జరిగిన అమానవీయ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రణబాలి పాత్ర డిమాండ్ అనుగుణంగా వయొలెన్స్ కూడా అవసరమైన మోతాదు కంటే ఎక్కువే పెట్టినట్టు టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్. ఈ మూవీ ఓవర్‌సీస్‌లో కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ కానుందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. ఇతర భాషల్లో డబ్బింగ్ పూర్తి కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. డబ్బింగ్ వర్షన్లు మాత్రం 2026 అక్టోబర్ 23న విడుదలవుతాయని పంపిణీదారులు క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పటికే విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మెయిన్ థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రీ-సేల్స్ ద్వారా 50 వేల డాలర్ల మార్కును దాటేసింది. రాబోయే రోజుల్లో ప్రీమియర్ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కాగా.. ఈ సినిమాకి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందించారు.  
 

 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)