Breaking News

దలాల్‌ స్ట్రీట్‌లో కల్లోలం! కుప్పకూలిన మార్కెట్లు

Published on Thu, 10/08/2026 - 14:16

భారత స్టాక్‌ మార్కెట్లలో గురువారం అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు నిఫ్టీ 359 పాయింట్లు కోల్పోయి 22,237 వద్ద, సెన్సెక్స్‌ 1,072 పాయింట్లు దిగజారి 71,564 వద్ద ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణంగా బుధవారం ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానంలో తీసుకున్న కీలక నిర్ణయం, పెరుగుతున్న ముడిచమురు ధరలు, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల వంటి అంశాలు నిలిచాయి.

ఆర్‌బీఐ పెట్టుబడిదారుల్లో అప్రమత్తత

నిన్నటితో ముగిసిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై తక్షణ ప్రభావం చూపింది. 2023 ఫిబ్రవరి తర్వాత ఇదే తొలి రెపో రేటు పెంపు. అంతకంటే ముఖ్యంగా, విధాన వైఖరిని న్యూట్రల్‌ నుంచి ‘క్యాలిబ్రేటెడ్‌ టైటెనింగ్‌’గా(సమీప భవిష్యత్తులో పెంపు దిశగా) మార్చడం ద్వారా ద్రవ్యోల్బణం విషయంలో కేంద్ర బ్యాంకు మరింత అప్రమత్తంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చింది. దీంతో రుణ వ్యయం పెరగడం, వినియోగం-పెట్టుబడులపై ఒత్తిడి రావడం, కంపెనీల భవిష్యత్‌ లాభాల అంచనాలు తగ్గే అవకాశాలపై ఈక్విటీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.

వృద్ధి బలంగా ఉన్నా ప్రతికూల సంకేతం

ఆర్‌బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ అంచనాను 5.0 శాతం నుంచి 5.2 శాతానికి పెంచింది. అదే సమయంలో వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచింది. అంటే ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఊతం ఉన్నప్పటికీ ధరల ఒత్తిడి కొనసాగవచ్చన్న అంచనా స్పష్టమైంది. బలమైన వృద్ధి సాధారణంగా ఈక్విటీలకు అనుకూలమైన అంశమే అయినా, ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం వడ్డీరేట్లు పెరుగొచ్చన్న అంచనాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లకు బ్యాంకింగ్‌, ఆటో, రియల్‌ ఎస్టేట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల్లో పెట్టుబడిదారులు జాగ్రత్త వహిస్తున్నారు.

ముడిచమురు ధరల దూకుడు.. రూపాయిపై ఒత్తిడి

పశ్చిమాసియా భౌగోళిక ఉద్రిక్తతలు, గల్ఫ్‌ ప్రాంతంలో సరఫరా అంతరాయాల భయాలతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 102 డాలర్లను దాటింది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ఇది ప్రమాదం. అధిక చమురు ధరలు దిగుమతి బిల్లును పెంచడంతో పాటు కరెంట్‌ అకౌంట్‌, ద్రవ్యోల్బణం, రూపాయి మారక విలువపై ఒత్తిడి పెంచుతాయి. అక్టోబర్‌ 8న రూపాయి డాలర్‌తో 96.77 స్థాయికి బలహీనపడటం కూడా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచింది. చమురు ధరలు ఎక్కువ కాలం ఎగువ స్థాయుల్లో కొనసాగితే ఆర్‌బీఐ మరింత కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించాల్సి రావచ్చన్న భయం ఈక్విటీ మార్కెట్లపై అదనపు భారంగా మారింది.

స్టాక్ మార్కెట్లలో బిగ్ క్రాష్.. 7.6 లక్షల కోట్ల సంపద ఆవిరి!

అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌, ఎఫ్‌ఐఐల విక్రయాలు

దేశీయ పరిణామాలకు తోడు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలోనూ అనిశ్చితి పెరిగింది. అమెరికా దీర్ఘకాలిక ట్రెజరీ ఈల్డ్స్‌ గణనీయంగా పెరగడం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడుల ఆకర్షణ తగ్గింది. అదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర విక్రయాలు భారత ఈక్విటీలపై ఒత్తిడిని మరింత పెంచాయి. పెరిగిన అమెరికా ఈల్డ్స్‌, బలమైన డాలర్‌, బలహీన రూపాయి.. ఈ మూడు కలిసి విదేశీ పెట్టుబడిదారులకు భారత్‌ వంటి మార్కెట్లలో కరెన్సీ రిస్క్‌ను పెంచుతున్నాయి.

ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్‌ రేట్లు!

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)