Breaking News

నవరసాల నానా.. మీమ్స్‌లో ఎప్పటికీ కేరాఫ్‌!

Published on Thu, 10/08/2026 - 11:31

తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు.. ఒక్కో పాత్రలో ఒక్కో రకమైన హావభావాలు. సీరియస్‌ సన్నివేశమైనా.. కామెడీ సీన్‌ అయినా.. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం నానా పటేకర్‌ ప్రత్యేకత. ఆయన నటించిన కొన్ని సన్నివేశాలు సినిమాలకే పరిమితం కాలేదు. సోషల్‌ మీడియాలో మీమ్‌ టెంప్లేట్లుగా మారి ఇప్పటికీ నెటిజన్లను నవ్విస్తూనే ఉన్నాయి. నానా పటేకర్‌ మరణంతో ఆయన లేని లోటు కనిపిస్తున్న వేళ.. ఆ ఫేమస్‌ సీన్లు మరోసారి గుర్తుకొస్తున్నాయి.

‘క్రాంతివీర్‌’లో ఆ నవ్వు..
1994లో విడుదలైన ‘క్రాంతివీర్‌’ నానా పటేకర్‌ కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమా. ఇందులో ఆయన పోషించిన ప్రతాప్‌ పాత్రకు భారీ గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమాలోని ఓ సీరియస్‌ సన్నివేశం మాత్రం ఏళ్ల తర్వాత మీమ్‌ మెటీరియల్‌గా మారింది. మంచంపై పడుకుని నానా పటేకర్‌ పగలబడి నవ్వే సీన్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.

ఎవరైనా చెప్పిన మాటను నమ్మలేనప్పుడు.. ‘ఇదేం కామెడీ రా బాబు’ అనే భావాన్ని వ్యక్తం చేయాలన్నా.. ఎదుటివారిని సరదాగా ఎగతాళి చేయాలన్నా ఈ సీన్‌ను నెటిజన్లు ఉపయోగిస్తుంటారు. ఈ సినిమా తెలుగులో మోహన్‌బాబు హీరోగా ‘పుణ్యభూమి నా దేశం’ పేరుతో రీమేక్‌ అయింది.

కాఫీ కప్పుతో ‘కంట్రోల్‌ ఉదయ్‌’
2007లో వచ్చిన ‘వెల్‌కమ్‌’లో ఉదయ్‌ శెట్టి పాత్ర నానా పటేకర్‌కు మరో రేంజ్‌లో క్రేజ్‌ తీసుకొచ్చింది. కోపం వచ్చిన ప్రతిసారీ తనను తానే కంట్రోల్‌ చేసుకుంటూ ‘కంట్రోల్‌ ఉదయ్‌.. కంట్రోల్‌’ అంటూ చెప్పే సన్నివేశం ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ఫేమస్‌.

కోపాన్ని ఆపే సందర్భాల్లో ఈ డైలాగ్‌ను మీమ్‌గా ఉపయోగించడం నెటిజన్లకు అలవాటుగా మారిపోయింది. అదే సినిమాలో చాయ్‌ తాగుతూ ఒక్కసారిగా నవ్వే నానా పటేకర్‌ ఎక్స్‌ప్రెషన్‌ కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఎవరి మాట విని నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితులను చూపించడానికి ఈ సీన్‌ను మీమ్స్‌లో ఉపయోగిస్తుంటారు.

‘ఏ దేనా..’ అంటూ డ్యాన్స్‌
2010లో వచ్చిన ‘తుమ్‌ మిలో తో సహీ’లోనూ నానా పటేకర్‌ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటుంది. డబ్బుల కోసం ఓ హిజ్రా డ్యాన్స్‌ చేస్తూ నానాను కవ్వించే సన్నివేశంలో ఆయన కూడా అదే తరహాలో డ్యాన్స్‌ చేస్తూ నవ్వులు పూయిస్తారు.

‘ఏ దేనా.. మైం తేరే లియే నాచీ’ అంటూ డబ్బులు అడిగే ఈ సీన్‌ కూడా సోషల్‌ మీడియాలో మీమ్స్‌ రూపంలో చక్కర్లు కొడుతోంది. సరదాగా ఎవరినైనా ఆటపట్టించే సందర్భాల్లో ఈ సన్నివేశాన్ని నెటిజన్లు ఉపయోగిస్తుంటారు.

చిల్లరకు చాక్లెట్‌ ఇస్తే..
నానా పటేకర్‌ నటించిన మరో సన్నివేశం నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. షాపింగ్‌ చేసిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు బదులుగా చాక్లెట్‌ ఇవ్వడంతో ఆయన తీవ్రంగా స్పందిస్తారు. డబ్బులకు బదులు చాక్లెట్‌ ఎందుకు తీసుకోవాలంటూ.. తన చెప్పులనే చిల్లరగా ఇస్తానన్నట్టుగా ఆయన ఇచ్చే రియాక్షన్‌ ఈ సీన్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఈ సన్నివేశం కూడా చాలాకాలంగా సోషల్‌ మీడియాలో మీమ్‌గా వైరల్‌ అవుతోంది.

నానా ఎక్స్‌ప్రెషన్స్‌కు తిరుగులేదు!
సినిమా మారింది.. పాత్ర మారింది.. సందర్భం మారింది.. కానీ నానా పటేకర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. విలన్‌గా భయపెట్టినా.. సీరియస్‌ పాత్రలో ఆలోచింపజేసినా.. కామెడీ సన్నివేశంలో నవ్వించినా తన ముఖ కవళికలతో సన్నివేశానికి ప్రాణం పోయడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. అందుకే నానా పటేకర్‌ నటించిన కొన్ని సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంతో ఆగిపోలేదు. ఏళ్ల తర్వాత కూడా సోషల్‌ మీడియాలో కొత్త సందర్భాలకు కొత్త అర్థాలతో మీమ్స్‌గా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నటుడిగా ఆయన తెరపై వదిలిన ముద్రకు ఇవి కూడా ఓ నిదర్శనమే.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో కొత్త ట్విస్ట్‌.. నామినేషన్స్‌లో ఉన్నవారికి..)

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)