ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
విజయ్-రష్మిక లగ్జరీ విల్లా.. విడిపోయేందుకే కొంటున్నారా?
Published on Fri, 10/02/2026 - 12:59
టాలీవుడ్లో మోస్ట్ ఫేమస్ జంటల్లో విజయ్ దేవరకొండ- రష్మిక ముందు వరుసలో ఉంటారు. ఆన్ స్క్రీన్‌పై మెరిసిన వీరిద్దరు రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటను విరోష్ అంటూ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లి తర్వాత కలిసి జంటగా నటించిన రణబాలి రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సంగతి పక్కనపెడితే విజయ్- రష్మిక జంటకు సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. పెళ్లి తర్వాత వీరిద్దరు వేరు కాపురం పెట్టనున్నారా? అనే చర్చ మొదలైంది. అందుకే హైదరాబాద్‌లో ఓ లగ్జరీ విల్లా కొనుగోలు చేస్తున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. విజయ్ తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటారా? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంపై విజయ్, రష్మిక నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
(ఇది చదవండి: డైరెక్టర్ తాగొచ్చి నన్ను కౌగిలించుకుంటావా? అని అడిగాడు: స్వర భాస్కర్)
విల్లా కేవలం భవిష్యత్ ప్లాన్‌లో భాగంగానే కొంటున్నారని తెలుస్తోంది. విల్లా కొనుగోలు అంటే వెంటనే అక్కడే కాపురం పెట్టాలని కాదు.. ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ కోసమేనని అర్థమవుతోంది. కాగా.. గతంలో తాము జాయింట్ ఫ్యామిలీగా ఉండటాన్ని ఇష్టపడతామని విరోష్ జంట చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని అర్థమవుతోంది.
Tags : 1