Breaking News

ఫాహద్‌ ఫాజిల్ మూవీ.. మహేశ్ బాబు ఫస్ట్‌ రివ్యూ

Published on Wed, 09/30/2026 - 19:29

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు మూవీ రివ్యూ ఇచ్చారు. ఫాహద్‌ ఫాజిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్‌ మూవీ డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కు తన సమీక్ష వెల్లడించారు. ఈ సినిమా వీక్షించిన మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ అద్భుతమైన అనుభవంతో ఎంతో చక్కగా తీర్చిదిద్దారని కొనియాడారు. పూర్తిగా వినోదాన్ని అందిస్తూ హృదయాన్ని లోతుగా తాకే కథతో నిర్మించారని ప్రశంసించారు. ఈ సినిమా అంతటా ఒక అరుదైన ఆత్మీయత కనిపిస్తోందని ప్రిన్స్ ట్వీట్‌ చేశారు.

ఫాహద్ సర్‌ మీరు అద్భుతమైన నటుడని.. ప్రయోగాలు చేయడం, మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడం చూడటం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. మీతో పాటు చిన్నారి ముద్దుల సారా కలిసి అద్భుతంగా నటించారని కొనియాడారు. అన్ని పాత్రలు ప్రతి క్షణం జీవించేశారని మహేశ్ బాబు ప్రశంసించారు.

మహేశ్‌బాబు తన ట్వీట్‌లో రాస్తూ.. 'కార్త్..  ఇంతకంటే ప్రత్యేకమైన ఆరంభాన్ని నువ్వు కోరుకోలేవు. ఈ సినిమా కోసం మీరు పడిన శ్రమ చూసిన తర్వాత.. మీరు ఇక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. మీరు, శోభు కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని సృష్టించారు. మీ ఇద్దరి సక్సెస్‌ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. శశాంక్ మీరు అద్భుతంగా నటించారు. ఈ అందమైన ప్రపంచాన్ని ఒకచోట చేర్చిన తీరు నిజంగా ప్రశంసనీయం. ఈ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. మీ చేతిలో ఒక ఆణిముత్యం ఉంది.. అక్టోబర్ 2వ తేదీ… ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను ఆనందించాలి' అని పోస్ట్ చేశారు. 
 

 

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)