వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
బ్రిటీషర్లు రైల్వే ఎందుకు నిర్మించారంటే?..రణబాలి మరో డాక్యుమెంటరీ
Published on Wed, 09/30/2026 - 18:45
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాని బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలోనే డాక్యుమెంటరీ రూపంలో ఈ మూవీ విశేషాలను ఆడియన్స్‌తో పంచుకుంటున్నారు. ఇప్పటికే ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్ అనే పార్ట్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రూత్ 2: ది హిస్టరీ వుయ్ ఫర్గాట్ విడుదల చేశారు. ఇందులో బ్రిటీష్ పాలనలో ఇండియన్ రైల్వేల గురించి వివరించారు. బ్రిటిషర్లు భారత్‌లో రైల్వే వ్యవస్థను నిర్మించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీని పూర్తిగా రాయలసీమ ప్రాంతంలోనే చిత్రీకరించారు. ఈ సినిమా కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కించారు.
Tags : 1