Breaking News

వయసెంతో చెప్పి షాకిచ్చిన తెలుగు సీరియల్ నటి

Published on Wed, 09/30/2026 - 13:17

సాధారణంగా ఆడపిల్లలు, మహిళలు తమ వయసు దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఏళ్లు అనేది అస్సలు చెప్పుకోరు. వేరే ఎవరు అడిగినా చెప్పేందుకు పెద్దగా ఇష్టపడరు. సెలబ్రిటీలు అయితే ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలని తెగ తాపత్రయపడుతుంటారు. కానీ తెలుగు సీరియల్ నటి మాత్రం నిర్భయంగా తన వయసుని బయటపెట్టింది. ఇది కోల్పోయేది కాదు సంపాదించుకునేది అని ఆసక్తికర స్టేట్‌మెంట్ ఇచ్చింది.

(ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట పవన్-రీతూ)

గతంలో 'పద్మవ్యూహం', 'మేఘసందేశం', 'మనసు మమత' తదితర సీరియళ్లలో నటించిన అస్మిత.. మొత్తంగా 15కి పైగా చేసింది. 2019లో కొరియోగ్రాఫర్ సుధీర్‌ని పెళ్లి చేసుకున్న ఈమె.. తర్వాత ఏడాది అంటే 2020 మేలో నటనకు వీడ్కోలు చెప్పేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్‌ ఛానెల్‌తో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. అయితే తన వయసు 46 ఏళ్లు అని చెప్పి నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

'ఈ రోజు నేను నన్ను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా ఏళ్లుగా నా వయసెంతో ఎప్పుడూ చెప్పలేదు. వయసు పెరగడం దాచుకోవాల్సిన విషయం అని మనల్ని నమ్మించేలా చేశారు. కానీ ఈ రోజు నేను 46 ఏళ్ల వయసులో ఉన్నాను. నా జీవితంలో నేను గడిపిన, ఎదుర్కొని నిలబడిన ప్రతి ఏడాది గురించి గర్వపడుతున్నా. నన్ను తీర్చిదిద్దిన అనుభవాలు, నాకు పాఠాలు నేర్పిన తప్పులు, నేను అందించిన, అందుకున్న ప్రేమ, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రయాణంతో మారిన వ్యక్తిత్వం గురించి గర్వపడుతున్నాను'

'నేను మళ్లీ చిన్నప్పటికి వెళ్లాలని కోరుకోవడం లేదు. నా జీవితంలో గడిచిన సంవత్సరాలని చెరిపివేయాలని అనుకోవడం లేదు. ఈ కొత్త దశలోనూ నేర్చుకుంటూ, ఎదుగుతూ, మారుతూ 100 శాతం వ్యక్తిత్వంతో జీవించాలని కోరుకుంటున్నాను. వయసు కోల్పోయేది కాదు. నేను సంపాదించుకునేది. అదే నా జీవితంలో అతిపెద్ద గర్వకారణం' అని అస్మిత రాసుకొచ్చింది. అయితే అస్మిత పోస్ట్ చూసిన కొందరు.. అంత వయసులా ఈమె కనిపించడం లేదే అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: వరదల్లో కొట్టుకుపోయిన 'ఇరుముడి' బ్రిడ్జి)

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)