Breaking News

ఏఐపై రాజమౌళి క్లారిటీ.. ఇకపై సినిమా అలా ఉండదట!

Published on Tue, 09/29/2026 - 21:13

నేటి ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకీ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఏఐతో రూపొందిస్తున్న వీడియోలు, పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. సినిమా రంగంలోనూ ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. దీనిపై అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏఐ గంటల్లో, నిమిషాల్లో పూర్తి చేస్తోంది
జార్జియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన రాజమౌళి.. సినిమా రంగంలో ఏఐ వినియోగం, దాని ప్రభావం గురించి వివరించారు. ‘ఏఐ భవిష్యత్తు గమనం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. సాంకేతికత, దాని వినియోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి పరిశోధన, అభివృద్ధి వంటి ప్రాథమిక పనులకు ఏఐ అద్భుతమైన సాధనం. గతంలో వారాలు, నెలలు పట్టే పనులను ఇప్పుడు ఏఐ గంటల్లో, నిమిషాల్లో పూర్తి చేస్తోంది’ అని అన్నారు.  ఇకపై సినిమా చాలా తొందరగా పూర్తిచేసేందుకు అవకాశముందన్నారు.

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తాము ప్రాథమిక సమాచారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఏఐని సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగిస్తున్నామని రాజమౌళి తెలిపారు. డిజిటల్‌ కంటెంట్‌, సినిమా నిర్మాణంలో ఏఐపై ఆధారపడటం లేదని స్పష్టం చేశారు.

120 దేశాల్లో విడుదల
ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో కీలక సన్నివేశాలను మోషన్‌ క్యాప్చర్‌ సాంకేతికతతో ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సింహభాగం పూర్తయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాను 50 భాషల్లోకి అనువదించి, 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 
ఇదీ చదవండి: పులిలా వచ్చిన ఎన్టీఆర్‌.. రాజమౌళి ఏర్పాట్లు అదుర్స్‌

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు