Breaking News

ఈ మూడు రోజులూ ATMలు మీ ఇష్టం!

Published on Sat, 09/26/2026 - 16:08

దేశవ్యాప్తంగా జరగనున్న మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక ఊరటనిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మె జరిగే మూడు రోజుల్లో ఏటీఎం నుంచి నగదు తీసుకునేటప్పుడు సాధారణంగా వర్తించే ఉచిత లావాదేవీల పరిమితిని దాటినా అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ సౌకర్యాన్ని ప్రకటించిన వాటిలో ఉన్నాయి.

ఏటీఎం ఛార్జీలపై ప్రత్యేక మినహాయింపు

సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారులకు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే ఆరు మెట్రో నగరాల్లో నెలకు మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు లావాదేవీల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పరిమితిని దాటిన తర్వాత బ్యాంకులు ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 వరకు, దానికి వర్తించే జీఎస్టీతో కలిపి ఛార్జీ విధించవచ్చు. అయితే సెప్టెంబర్ 28–30 మధ్య ఈ అదనపు ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సమ్మె సమయంలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంను ఉపయోగించినా లావాదేవీ ఛార్జీలు వర్తించవని ప్రకటించింది. ఎస్‌బీఐ సైతం సమ్మె కాలంలో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో నగదు అవసరమయ్యే ఖాతాదారులు తమ సాధారణ ఉచిత పరిమితి ముగిసినా ఈ మూడు రోజుల్లో అదనపు ఏటీఎం రుసుము గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఆదివారమూ బ్యాంకులు ఓపెన్‌

సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు సెప్టెంబర్ 27, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అత్యవసర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులను సెప్టెంబర్ 27న బ్రాంచ్ సేవలను వినియోగించుకోవాలని సూచించాయి.

సెప్టెంబర్ 26 నాలుగో శనివారం కావడంతో ఇప్పటికే బ్యాంకులకు సెలవు ఉంది. ఆ తర్వాత 27న ఆదివారం, 28 నుంచి 30 వరకు సమ్మె జరగనుండటంతో బ్రాంచ్ సేవలకు వరుసగా పలు రోజులపాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల చెక్కులు, నగదు డిపాజిట్లు, ఇతర బ్రాంచ్ ఆధారిత పనులు ఉన్నవారు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: యూపీఐ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చేసిన ఆర్థిక మంత్రి

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)