వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
బిజినెస్ పసిబిడ్డ లాంటిదే!
Published on Sat, 09/26/2026 - 14:58
చాలామంది ఉద్యోగం చేసేవారు.. సొంతంగా బిజినెస్ చేయాలని అనుకుంటారు. అయితే వ్యాపారం అనేది ఒక పసిబిడ్డ లాంటిదని కాంట్రారియన్ థింకింగ్ వ్యవస్థాపకురాలు కోడీ సాంచెజ్ చెబుతున్నారు. ఇంతకీ ఆమె ఎందుకలా అన్నారు?, దీనికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కోడీ సాంచెజ్ ప్రకారం.. ఒక బిడ్డ పుట్టినప్పుడు, తనంతట తాను ఏ పని చేసుకోలేదు. తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాలి, తినిపించాలి, నడిపించాలి. ఇలా ప్రతి విషయంలో సహాయం చేయాలి. కొత్తగా ప్రారంభించిన వ్యాపారం కూడా అలాగే ఉంటుంది. మొదట్లో యజమానే అన్నీ చూసుకోవాలి. కస్టమర్లను సంపాదించడం నుంచి డబ్బులు చూసుకోవడం వరకు ప్రతి విషయానికీ యజమాని సమయం, శ్రమ వెచ్చించాలి.
కొంతకాలం తర్వాత.. బిడ్డ నడవడం నేర్చుకుంటుంది. కానీ మొదట్లో ఎవరో ఒకరి చేయి పట్టుకుని నడుస్తుంది. వ్యాపారం కూడా ఒక దశలో ఇలాగే ఉంటుంది. కొంత ఆదాయం రావడం మొదలవుతుంది, ఉద్యోగులు చేరుతారు, పనులు కొంత సిస్టమ్‌లోకి వస్తాయి. అయినా యజమాని సహాయం, పర్యవేక్షణ అవసరమే.
ఆ తర్వాత ఒక దశలో బిడ్డ తనంతట తానే నడవడం, పరుగెత్తడం మొదలుపెడుతుంది. మంచి వ్యాపారం కూడా చివరికి అలాంటి స్థాయికి చేరాలి. యజమాని ప్రతి చిన్న పనిని స్వయంగా చేయాల్సిన అవసరం లేకుండా, ఉద్యోగులు, సిస్టమ్స్ కలిసి వ్యాపారాన్ని నడిపించాలి.
అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి వ్యాపారం ఒకే వేగంతో ఎదగదు. కొన్ని వ్యాపారాలు త్వరగా స్వతంత్రంగా మారుతాయి. మరికొన్ని వ్యాపారాలకు ఎక్కువ సమయం, ఎక్కువ శ్రద్ధ అవసరం కావచ్చు. అది సహజమే.
ఇదీ చదవండి: అందుకే.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్!
వ్యాపారం మొదట మనపై ఆధారపడుతుంది, తర్వాత మన సహాయంతో ఎదుగుతుంది, చివరికి మనం ప్రతి రోజు దాని వెనుక నిలబడాల్సిన అవసరం లేకుండా పనిచేసే స్థాయికి చేరుతుంది. కాబట్టి.. వ్యాపారాన్ని ప్రారంభించడం ఎంత ముఖ్యమో, దాన్ని మన మీద పూర్తిగా ఆధారపడకుండా నిర్మించడం కూడా అంతే ముఖ్యం. ఒక తల్లిదండ్రి తన బిడ్డను ఎప్పటికీ చేయి పట్టుకుని నడిపించరు. ఒకరోజు ఆ బిడ్డ తనంతట తానే నడవాలి. అదే విధంగా ఒక వ్యాపారం కూడా ఒకరోజు యజమాని సహాయం లేకుండానే ముందుకు సాగే స్థాయికి చేరాలి.
A business is like a baby: - first it’s fully dependent on you - then it starts walking with your help - and finally it's running around on its own Some grow faster than others, but they all follow a similar path.
— Codie Sanchez (@Codie_Sanchez) September 10, 2026
Tags : 1