వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
నేను అడగలేదు కానీ ఆ డైరెక్టర్ పెళ్లి గిఫ్ట్‌లా డబ్బులిచ్చారు: లయ
Published on Sat, 09/26/2026 - 11:15
ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ల విషయంలో ఎంత రచ్చ జరుగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులకు ఇవ్వాల్సిన పారితోషికాల్ని కొందరు నిర్మాతలు ఎగ్గేస్తుంటారు. కానీ ఒకప్పటి హీరోయిన్ లయకు మాత్రం ఓ దర్శకుడు.. పెళ్లి బహుమతిలా పారితోషికాన్ని ఇచ్చాడు. అయితే ఆయన అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: చిరంజీవి అన్నీ చూస్తున్నారు.. కానీ ఇలా మాట్లాడుతారనుకోలేదు)
'నా పెళ్లి రిసెప్షన్‌కి పిలిస్తే చాలా పెద్ద డైరెక్టర్ ఒకరు రాలేకపోయారు. ఒక గిఫ్ట్‌లా ఏదో పార్సిల్ పంపిస్తే ఏదో గిఫ్ట్‌లే అనుకున్నాను. తెరిచి చూస్తే డబ్బులున్నాయి. అంత డబ్బులు ఎందుకు పంపిస్తారు ఎవరైనా? అని చూస్తే అందులో ఓ లెటర్ ఉంది. అమ్మా నేను నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇది. అప్పుడు ఇవ్వలేకపోయాను. కనీసం నీ పెళ్లి టైంలో అయినా ఇస్తున్నాను. ఇదే నీ గిఫ్ట్ అనుకో. దీవెనలు అనుకో అని రాసిస్తే నేను షాకైపోయాను. అసలు నేను అడగలేదు. పోయిందనే అనుకున్నాను. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. వదిలేసుకున్నాను కదా. ఆల్రెడీ అది జరిగి మూడు నాలుగేళ్లు అయిపోయింది. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నాను. ఇక నాతో ఆయనకు అసలు పనిలేదు. ఆయనంతట ఆయనే ఫీలై ఆయన దగ్గర అప్పుడు డబ్బులుండి.. అయ్యో అమ్మాయికి ఇవ్వలేదు. కాబట్టి నేను ఇస్తాననేది మంచి విషయమే కదా' అని లయ చెప్పుకొచ్చింది.
అయితే లయ ప్రస్తావించిన విషయంలోని దర్శకుడు కె.విశ్వనాథ్ అని తెలుస్తోంది. 2004లో ఈయన దర్శకత్వంలో వచ్చిన 'స్వరాభిషేకం'లో లయ హీరోయిన్గా చేసింది. షూటింగ్ టైంలో ఇవ్వలేకపోయిన మిగిలిన పారితోషికాన్ని.. 2006లో లయ పెళ్లి చేసుకున్న టైంలో పూర్తిగా ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ కూతురి లవ్‌స్టోరీ.. ట్రైలర్ రిలీజ్)
Tags : 1