Breaking News

‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్‌ మిరాకిల్‌

Published on Wed, 09/23/2026 - 11:33

కొన్ని సంఘటనలు, అరుదైన వ్యాధులు విసిరే సవాళ్లు ఆధునిక వైద్యనికే అంతుచిక్కదు. ఒక్కోసారి ఆ సవాళ్లే కొంగొత్త వైద్య ఆవిష్కరణాలను నాంది పలికి..ఎందరినో ఆ అనారోగ​ సమస్యల నుంచి బయపడేసేందుకు దారితీస్తుంది. బతికే అవకాశాలు లేనప్పుడూ కూడా వైద్యానికే అందని విధంగా మిరాకిల్‌ జరిగి మరి జీవిస్తున్న ఎన్నో అద్భుతాలను చూశాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన అంతకుమించిన మిరాకిల్‌ ఘటన. ఒక్కసారే ఎవ్వరైన జన్మిస్తాం..కానీ ఈ శిశువు ఏకంగా రెండుసార్లు జన్మించింది. బహుశా ఇదే వైద్యశాస్త్రంలోని అత్యంత అరుదైన ఘటనేమో..!.

అసలేం జరిగిందంటే..2016లో ఒక అత్యంత అరుదైన కేసుని ఎదుర్కొన్నారు అమెరికా వైద్యులు. టెక్సాస్‌కి చెందిన మార్గరెట్‌ బోమర్‌ సాధారణ ప్రెగ్నెన్సీ చెకప్‌కి వెళ్లింది. ఎప్పటిలానే ఆరోజు పరీక్షలు చేయించుకుంది. స్కానింగ్‌ ఆమె గర్భంలోని శిశువు వెనుముక చివరలో శాక్రోకాక్సిజియల్ టెరాటోమా అనే అరుదైన కణితి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఆ శిశువు మనుగడ సాగించడం కష్టమని తేల్చేశారు. 

ఎందుకంటే ఆ కణితి..పిండానికి అందాల్సిన రక్తాన్ని దారిమళ్లిస్తోంది. ఫలితంగా ఆ ఒత్తిడి గుండెపై పడి గుండె వైఫల్యానికి దారితీసే ప్రమాదిన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అంటే ఆ శిశువు 26 వారాల రాక మునుపే గర్భంలో చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ విషయం తెలిసి ఆ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమెకు ఇది అత్యంత భయాన ఉద్విగ్న క్షణం ఎందుకంటే. అసలు నిజానికి ఆమె గర్భంలో కవలలు పెరిగారు. 

అందులో ఒక శిశువు రెండో నెలలోనే గర్భస్రావం అయ్యింది. పోనీలే మరో శిశువు ఆరోగ్యంగా పెరుగుతోంది కదా అనుకుంటే ..మళ్లీ ఇలాంటి విషయం వినడంతో మరింతగా హడలిపోయింది మార్గరేట్‌. చాలామంది వైద్యులు గర్భం తొలగించుకోవాల్సిందే సూచించారు. ఎందుకంటే ఆ కణితిని అతి కష్టంపై సర్జరీ ద్వారా తొలగించినా..ఆ చిన్నారి బతికే అవకాశాలు 50% మాత్రమే అని తేల్చేశారు వైద్యలు. 

అయితే మార్గరేట్‌ ఆమె భర్త ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనే నిర్ణయానికి వచ్చి.. టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఒక ప్రత్యేక శస్త్రచికిత్స బృందాన్ని ఆశ్రయించారు. అక్కడ పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే..నేరుగా శస్త్ర చికిత్స చేసి..తిరిగి గర్భం కొనసాగేలా ఆ పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే ప్రమాదకరమైన ప్రక్రియ గురించి వైద్యలు ఆమెకు వివరించారు.  23 వారాల గర్భం నాటికే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..తక్షణమే గుండె పనితీరుని దెబ్బతీస్తున్న ఆ కణితిని తొలగించే సర్జరీ చేశారు. 

అరచేతిలో ఇమిడిపోయే అత్యంత చిన్న పిండాన్నే గాల్లో ఉంచే కణితిని తొలగించారు. చెప్పాలంటే..ఆపరేషన్‌ జరుగుతున్నంత సేపు గుండె ఆగిపోయింది. అయితే హార్ట్‌ సర్జన్‌ ఆ శిశువుని బతికించారు. ఆ శస్త్ర చికిత్స సమయంలోనే ఆక్సిజన్ని ప్లాసెంటా ద్వారా తల్లికి అనుసంధానించారు. అలా కణితిని తొలగించి..ఆ ఆడ శిశువుని తిరిగి గర్భంలోని ప్రవేశపెట్టి..శరీరంలో ద్రవాల సమతుల్యత పునరుద్ధరించి..గర్భాశయాన్ని పూర్తిగా కుట్టువేసి మూసివేశారు. 

అంతేగాదు మార్గరేట్‌ని కఠినమైన విశ్రాంతిలో ఉంచి ఆ శిశువు గర్భంలో ఆరోగ్యంగా పెరిగేలా చేశారు. అలా 36 వారాల అనంతరం రెండోసారి సీ సెక్షన్‌ ద్వారా ఆ శిశువుని బయటకు తీశారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. ఆ చిన్నారి సుమారు 2.41 గ్రాముల ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం విశేషం. 

ఆ చిన్నారి బయటకొచ్చిన ఎనిమిది రోజులకు వెన్నుముక చివరి ఎముక కణజాలన్ని శుభ్రం చేసేందుకు ఒక సాధారణ ఆపరేషన్‌ చేశారు. ఆ అద్భుత శిశువుకి లిన్లీ హూప్‌ అని పేరు పెట్టారు. సదరు తల్లి మార్గరేట్‌ మాత్రం ఇది అద్భుతమైన భయానక క్షణంగా పేర్కొంది. ఎందుకంటే క్షణం, క్షణం ఉత్కంఠ..బతికించుకోగలనా అన్న సందేహాల మధ్య సాగిన గర్భధారణ అని అంటోందామె.

ఇదీ చదవండి: Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్‌

 

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)