Breaking News

ది ప్యారడైజ్ ప్రీమియర్‌ షో.. టికెట్ ధర ఎంతంటే?

Published on Sun, 09/20/2026 - 19:13

నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ది ప్యారడైజ్ టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌లో మొదటి నాలుగు రోజులు రూ.48 పెంచుకోవచ్చని తెలిపింది. మల్టీప్లెక్స్‌లో రూ.94 అదనంగా వసూలు చేసేందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత 28వ తేదీ నుంచి అక్టోబరు 3 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.23, మల్టీప్లెక్స్‌ల్లో రూ.45 పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది.

అంతేకాకుండా తెలంగాణలో ఈనెల 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్‌ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్‌ ధరను రూ.500గా నిర్ణయించారు. ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా పర్మిషన్ వచ్చేసింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ కమిటీకి చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్‌ ఎల్‌ఎల్‌పీ రూ.కోటి అందజేసింది.

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)